Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాద శిక్షణ..
- బంగ్లాదేశ్‌లో పట్టుబడిన ఉగ్ర సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద సంస్థ పట్టుబడింది. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థపై ఉగ్రవాద నిరోధక దర్యాప్తు సంస్థలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ‘‘ఫతాహ్ కాంబాట్ సిస్టమ్(ఎఫ్‌సీఎస్)’’ పేరుతో ఈ సంస్థ పలువురికి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తోంది. ఈ సంస్థ అధినేతతో పాటు ట్రైనర్లు, విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంస్థ ఉగ్రవాద భావజాలాన్ని యువతలో వ్యాప్తి చేస్తుందని ఆరోపణలు రావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీసుల కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్స్‌నేషనల్ క్రైమ్ (CTTC) ఈ మొత్తం ఉగ్ర కుట్రను భగ్నం చేసింది.
ఈ ఉగ్ర సంస్థ చీఫ్ షా అమానత్ సబీర్ మొబైల్ ఫోన్లో లభించిన రెండు నిమిషాల వీడియలో గ్రామీణ ప్రాంతాల్లో పేలుళ్లు, తీవ్రవాద నినాదాలు, పదునైన ఆయుధంతో బెదిరింపులు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఈ వీడియోలో ఐసిస్ ప్రచార గీతాలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. 2024లో షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడానికి కారణమైన విద్యార్థి నేతల పార్టీ ‘‘నేషనల్ సిటిజన్స్ పార్టీ’’కి చెందిన జాయింట్ సెక్రటరీ అలా ఉల్లా షాను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఈ ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న 19 ఏళ్ల తహసీన్ ఇస్లాం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంస్థ తనను ఇస్లామిక్ మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ సంస్థగా చెప్పుకుంటోంది. చేతితో పోరాటం చేయడం, ఆయుధాల నుంచి రక్షణ, టాక్టికల్ మూవ్మెంట్, సర్వైవల్ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నామని దీని అధికారిక వెబ్సైట్ పేర్కొంది.
Also Read
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
- Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?