UP Stampede: ఘోర విషాదం.. యూపీ తొక్కిసలాటలో 107 పైగా మృతి..
- ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర విషాదం..
- హత్రాస్‌లో జరిగిన ధార్మిక కార్యక్రమంలో తొక్కిసలాట..
- 87 మంది మృతి.. ఎక్కువగా మహిళలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Stampede: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 107 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి తాజగా అందిన లెక్కల ప్రకారం, 107 మందికి పైగా మరణించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు.
హత్రాస్ జిల్లాలో శివుడికి సంబంధించిన ధార్మిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముగియగానే, తొక్కిసలాట జరిగింది. మానవ్ మంగళ్ మిలన్ సద్భావనా సమాగం కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అకాస్మత్తులగా తొపులాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అంతా బయటకు వచ్చారని, డ్రెయిన్ పైన రోడ్డు నిర్మించారని, అంతా అందులోపడి నలిగిపోయారని చెప్పారు.
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
Read Also: Nimmala Ramanaidu: గత ప్రభుత్వ పాలన పోలవరానికి శాపంగా మారింది..
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్‌పై పోస్ట్‌లో తెలిపారు. ఇద్దరు రాష్ట్ర మంత్రులు లక్ష్మీ నారాయణ్ చౌదరి మరియు సందీప్ సింగ్ గ్రామానికి బయలుదేరారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!