Train Fire Accident: గుజరాత్‌లోని తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ మధ్య నడిచే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. రైలు నుంచి పొగలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో జరిగినట్లు అధికారులు తెలిపారు.
రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ రైల్వేకు చెందిన CPRO సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. రైల్ నంబర్ 22498 యొక్క పవర్ కార్/బ్రేక్ వ్యాన్ కోచ్‌లో మంటలు కనిపించాయని తెలిపారు. దీంతో వెంటనే పక్కనే ఉన్న కోచ్‌లోని ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేశారని పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అన్నారు. ఈ రైలు నుండి కోచ్‌ను వేరు చేసిన తర్వాత.. వీలైనంత త్వరగా పంపుతారన్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు.
#WATCH | Fire breaks out in Humsafar Express, which runs between Tiruchirappalli and Shri Ganganagar, in Gujarat's Valsad; no casualty reported till now pic.twitter.com/p5Eyb7VQKw
— ANI (@ANI) September 23, 2023
Read Also: PM MODI: కాశీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని శంకుస్థాపన