Chandrababu Oath Taking Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తుది దశకు ఏర్పాట్లు
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సిద్ధం అవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
- రేపు గన్నవరం ఐటీ పార్క్ దగ్గర నాల్గో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తుది దశకు చేరుకున్నాయి ఏర్పాట్లు
- గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Oath Taking Ceremony: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి సిద్ధం అవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రేపు గన్నవరం ఐటీ పార్క్ దగ్గర.. నాల్గో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. ఇక, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తుది దశకు చేరుకున్నాయి ఏర్పాట్లు.. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అగ్రనేతలు హాజరుకానున్నారు.. రేపు ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు విజయవాడలో ఉండనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. వీఐపీల తాకిడి నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టారు అధికారులు.. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్ నీరభ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్, డీజీపీతో నిన్నే సమీక్ష జరిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..
Read Also: Jaipur: రూ.300 విలువైన నకిలీ నగలను రూ.6కోట్లకు కొనుగోలు చేసిన అమెరికన్ మహిళ..
Also Read
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
- ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
ఇక, వీఐపీల కోసం నాలుగు గ్యాలరీలు, ప్రజల కోసం ఒక గ్యాలరి మొత్తం 5 గ్యాలరీలు ఏర్పాటు చేశారు.. జాతీయ రహదారి పక్కనే ఉన్న కేశరపల్లిలో కార్యక్రమం కావటంతో హైవే పై ఆంక్షలు విధించారు పోలీసులు.. ఇవాళ్లి సాయంత్రం నుంచే ట్రాఫిక్ మళ్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.. మరోవైపు.. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి 2 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు.. సభా ప్రాంగణంలో ఎక్కడ ఉన్నా.. సభా వేదికపై జరిగే కార్యక్రమాన్ని చూసేందుకు వీలుగా భారీ LED తెరలు ఏర్పాటు చేశారు.. పారిశుధ్యం, భద్రత, బారికేడింగ్, వైద్య శిబిరాలు, మజ్జిగ, తాగునీరు, భోజనం వంటి ఏర్పాట్లను చేస్తున్నారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో.. 7 వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Read Also: UGC: యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు..యూజీసీ సంచలన నిర్ణయం..
రేపు గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో జరిగే సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి.. పలువురు అతిథులు హాజరు కానున్నారు.. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని స్టేట్ గెస్ట్ గా ఆహ్వానించారు.. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నారు..
తాజావార్తలు
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
ట్రెండింగ్
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!