UGC: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ మోడ్‌లో విద్యను అందించే ఉన్నత విద్యా సంస్థలను(HEIs) ఏడాదికి రెండుసార్లు విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతించాలని నిర్ణయించింది. కొత్త నిర్ణయం ప్రకారం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి జనవరి / ఫిబ్రవరి లేదా జూలై/ ఆగస్టులో అడ్మిషన్లు అందించవచ్చు. ఆన్‌లైన్/ODL మోడ్‌లో లేదా రెగ్యులర్ ఫిజికల్ మోడ్‌లో సంవత్సరానికి రెండుసార్లు ప్రోగ్రామ్‌లను అందించే HEIలు అడ్మిషన్‌లను అందించవచ్చు. భారతీయ విశ్వవిద్యాలయాలు సంవత్సరానికి రెండుసార్లు అడ్మిషన్‌ను అందించగలిగితే, అది చాలా మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ అన్నారు.
ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు అందించడం తప్పనిసరి కానప్పటికీ, విద్యార్థుల చేరికను పెంచాలనుకునే, అభివృద్ధి చెందుతున్న విద్యలో కొత్త ప్రోగ్రామ్స్ అందిచాలనుకునే ఉన్నతవిద్యా సంస్థ(HEI)లకు ఈ సౌలభ్యం అందించబడింది. ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు అందించాలనుకుంటున్న విద్యాసంస్థలు తమ నిబంధనలను తగిన సవరణలు చేయాల్సి ఉంటుంది. యూజీసీ 2023 జూలై 25న జరిగిన 571వ కమిషన్‌లో ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) మరియు ఆన్‌లైన్ మోడ్‌లలో ద్వివార్షిక అడ్మిషన్లను అనుమతించాలని గతంలో నిర్ణయించింది.
Read Also: Terrorist Attack: రియాసి బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులకు పూంచ్ ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్ దాడితో సంబంధం..
ప్రస్తుతం ఉన్న యూజీసీ నిబంధనల ప్రకారం, ఉన్నత విద్యాసంస్థలు జూలై/ఆగస్టులో ఏడాదికి ఒకసారి విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతిస్తాయి. అకడమిక్ సెషన్ పన్నెండు నెలలు, జూలై/ఆగస్టులో ప్రారంభం అవుతుంది. భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థలు జూలై-ఆగస్టులో ప్రారంభమై మే -జూన్ నెలలో ముగిసే అకడమిక్ సెషన్ అనుసరిస్తాయి.
యూజీసీ ఓపెన్ మరియు డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) మరియు ఆన్‌లైన్ మోడ్‌ల కోసం ఒక సంవత్సరంలో రెండుసార్లు అడ్మిషన్‌కి అనుమతించిన తర్వాత గణనీయంగా ప్రవేశాలు పెరిగాయి. జూలై 2022లో మొత్తం 19,73,056 మంది విద్యార్థులు నమోదు చేయబడ్డారు, జనవరి 2023లో అదనంగా 4,28,854 మంది విద్యార్థులు ODL మరియు ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లలో చేరారు. ఒకే ఏడాది రెండోసారి అడ్మిషన్ అనుమతించడం వల్ల దాదాపుగా 5 లక్షల మంది విద్యార్థులు పూర్తి విద్యాసంవత్సరం వరకు వేచి చూడకుండా వాడి డిగ్రీ ప్రోగ్రాంలో చేరేందుకు సాయపడింది. దీని వల్ల సంస్థలు, పరిశ్రమలు రెండుసార్లు తమ క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు, ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది.
UGC announces biannual admissions in HEIs. An important announcement in the history of higher education in India.#UGC #BiannualAdmissions #Education #Students #Admissions pic.twitter.com/n2SchXiRoR
— UGC INDIA (@ugc_india) June 11, 2024