బాలీవుడ్ స్టార్ హీరో హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఫైటర్”.సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇండియా మొట్టమొదటి ఏరియల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన హృతిక్ రోషన్ , దీపికా పదుకొనే రోల్స్ లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..ఫైటర్ మూవీ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ చిత్రం నుంచి ఏదో ఒక అప్‌డేట్ ను అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ఫైటర్ ట్రైలర్‌ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్‌లో లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ చిత్రంలో కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేఖ్ మరియు తలత్ అజిజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ఎయిర్ డ్రాగన్స్ విభాగంలో స్క్వాడ్రన్ పైలట్ గా పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించబోతున్నాడు. మరోవైపు దీపికాపదుకొనే ఎయిర్ డ్రాగన్ యూనిట్‌లో పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా కనిపించనుంది.. ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్-మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.హృతిక్ రోషన్, దీపికా పదుకొనే క్రేజీ కాంబోలో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి..అలాగే పఠాన్ సినిమా తరువాత సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న కావడంతో ఫైటర్ మూవీ పై భారీ అంచనాలు వున్నాయి. మరి ఈ సినిమా పఠాన్ మూవీ లా బిగ్గెస్ట్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో రాబోతున్న ‘వార్ 2’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా లో పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఈ చిత్రం 2025 న గ్రాండ్ గా విడుదల కానుంది.
The Air Dragons are geared up to soar, fight and protect 🇮🇳 #FighterTrailer TOMORROW at 12:00 PM IST. #Fighter Forever#FighterOn25thJan releasing worldwide. Experience on the big screen in IMAX 3D. pic.twitter.com/mjNxvmof8M
— Viacom18 Studios (@Viacom18Studios) January 14, 2024