టీమిండియాకు ఈ ఏడాది ఎలా ఉంది..? ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయి. దానికి సంబంధించి.. బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఏడాది పొడవునా టీమిండియా ప్రదర్శనను క్లుప్తీకరించారు. అలాగే.. భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన చిరస్మరణీయ క్షణాలను ప్రదర్శించారు. ఈ ఏడాది శ్రీలంక సిరీస్‌తో టీమిండియా శుభారంభం చేసింది. ఈ టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-1తో శ్రీలంకను ఓడించింది. ఆ తర్వాత భారత మహిళల అండర్-19 జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
Read Also: YSRCP: వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ సోషల్ మీడియా కమిటీ నియామకం
అయితే, బీసీసీఐ షేర్ చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఈ వీడియోను అభిమానులు బాగా లైక్ చేస్తున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేయడం ద్వారా తమ అభిప్రాయాన్ని నిరంతరం తెలియజేస్తున్నారు. అయితే ఈ ఏడాది రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. కాగా.. ఆసియా కప్‌తో సహా అనేక చిరస్మరణీయ విజయాలను టీమిండియా నమోదు చేసింది.
Read Also: Students Dance: రాముడి పాటపై స్కూల్ పిల్లలు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారో చూడండి..
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్‌కు ముందు ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగిది. కానీ ప్రపంచకప్ టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత జట్టును ఓడించింది. భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అదే సమయంలో.. టీమిండియా మూడోసారి వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్‌ను కోల్పోయింది. ఏదేమైనప్పటికీ.. ఈ సంవత్సరం భారత క్రికెట్ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.
⏪ Recap an eventful 2023 with some 🔝 moments on the field ft. #TeamIndia 😃👌
Tell us your favourite one among all 👇 pic.twitter.com/JNjLbNgCVQ
— BCCI (@BCCI) December 31, 2023