అయోధ్యలో రామ్ లల్లా విగ్రహా ప్రతిష్టాపనకు సమయం దగ్గరపడుతుంది. ఇప్పటికే అయోధ్య గుడి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తికాగా.. తుదిదశ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు దేశమంతా అయోధ్య పేరే వినిపిస్తుంది. 2024 జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహా ప్రతిష్టాపన జరగనుంది. ఇదిలా ఉంటే.. స్కూల్ లో పిల్లలు ఏమైనా కార్యక్రమాలు ఉంటే పాటలు కానీ, డ్యాన్స్ లు చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఓ స్కూల్ లో పిల్లలు రాముడి పాటలపై డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో భారతీయుల హృదయాలను గెలుచుకుంది.
Jammu Kashmir: ఉగ్రవాదంపై సమాచారం ఇస్తే భారీ నజరానా.. రూ.1 లక్ష నుంచి రూ.12.50 లక్షల రివార్డ్..
ఆ వీడియోలో.. పాఠశాల లోపల ఒక హాలులో చాలా మంది పిల్లలు గుమిగూడి ఉండడం చూడవచ్చు. ఆ సమయంలో.. రాముడి పాట రాగానే, పిల్లలందరూ అద్భుతంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. స్కూల్ పిల్లలు సినిమా పాటలపై డ్యాన్స్ చేస్తున్న వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కానీ భక్తిగీతాలపై స్కూల్ పిల్లలు డ్యాన్స్ చేయడం అరుదుగా కనిపిస్తాయి. ఈ అద్భుతమైన వీడియోను బాగేశ్వర్ ధామ్ మహారాజ్ అని పిలవబడే పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి పేరడీ ఫ్యాన్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. అంతేకాకుండా క్యాప్షన్ కూడా రాశారు. ‘అందమే కాదు చాలా అందంగా ఉంది… ప్రతి పాఠశాలలోని పిల్లలకు అసభ్య నృత్యం కంటే ఇది మంచిది. మతపరమైన పాటలపై నాట్యం నేర్పించాలి. జై శ్రీరామ్’. అని ఉంది. ఈ వీడియోను ఇప్పటివరకు 45 వేలకు పైగా వీక్షించగా, వేలాది మంది ఈ వీడియోను లైక్ చేసి వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు.
सुन्दर ही नही अति सुन्दर…😍
फूहड़ता वाले नृत्य से अच्छा है हर स्कूल में बच्चों को धार्मिक गानों पर नृत्य सिखाया जाए..
जय श्रीराम🙏https://t.co/e4z44h1Abf pic.twitter.com/evYVRO9x8P
— पं.धीरेंद्र कृष्ण शास्त्री (@DhirendraIN) December 31, 2023
Lucky Draw: బిర్యాని తిన్నాడు… కారు గెలిచాడు!