ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హోండా వాహనాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. యూత్ కు నచ్చే విధంగా కొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. తాజాగా మరో కొత్త బైక్ ను అదిరిపోయే ఫీచర్స్ తో లాంచ్ చేసింది.. హోండా సీబీ1000 హార్నెట్ పేరుతో తీసుకురానున్న ఈ బైక్‌లో అత్యాధునిక ఫీచర్లను అందించనున్నారు. ఇటీవల జరిగిన 2023 ఈఐసీఎంఏ ఈవెంట్‌లో ఈ కొత్త బైక్‌ను లాంచ్ చేశారు.. ఈ కొత్త బైక్ ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, రెస్టెడ్ ఫ్యుయల్ ట్యాంక్‌ను అందించారు. ఇక ఇంజన్.. ఈ బైక్‌లో 999 సీసీ, లిక్విడ్ కూల్డ్, 16 వాల్వ్, ఇన్‌లైన్ 4 సిలిండర్లను అందించారు. 150 హెచ్‌పీ పవర్ జనరేట్ చేయడం ఈ ఇంజన్ ప్రత్యేకత. ఇక సస్పెన్షన్స్ కోసం ఫ్రెంట్లో షోవా ఇన్వర్టెడ్ ఫోర్క్స్‌ని, రేర్‌లో ప్రో-లింక్ మోనో షాక్ యూనిట్‌ని ఉపయోగించారు… ఈ బైక్ కు అద్భుతమైన టెక్నాలజీ తో తయారు చేశారు.. సీబీ1000 హార్నెట్‌లో రైడ్ బై వైర్ సిస్టెమ్, 5 ఇంచ్ ఫుల్- కలర్ టీఎఫ్‌టీ స్క్రీన్, 5 రైడింగ్ మోడ్స్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. ఇదిలా ఉంటే ఈ బైక్ ధర గురించి ఎక్కడా ప్రకటించలేదు..
ఈ బైకును వచ్చే ఏడాది మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. జపాన్‌లో డిజైన్ చేశారు. ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్‌ను ఈ బైక్‌లో అందించారు. ఇక ఈ బైక్‌లో 4-2-1 ఎక్సాస్ట్ సిస్టమ్‌ను అందించారు. అంతేకాకుండా అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ బైక్‌లో 5 ఇంచెస్‌తో కూడిన కలర్ టీఎఫ్‌టీ స్క్రీన్‌ను అందించారు. అలాగే ఈ బైక్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.. ఇకపోతే సెలక్టబుల్ టార్క్ కంట్రోల్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, 3 డీఫాల్ట్ రైడింగ్ మోడ్స్‌ను కూడా అందించారు..