Honda CB650R E-Clutch: హోండా మోటార్ సైకిల్స్ తన CB650R మోడల్‌కు ఇ-క్లచ్ (E-Clutch) వేరియంట్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్దమవుతోంది. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఈ విషయాన్ని సంస్థ ధృవీకరించింది. E-Clutch టెక్నాలజీకి సంబంధించిన మొదటి వాహనం కావడం గమనార్హం. హోండా లైనప్‌లో ఉన్న 650cc ఇన్ లైన్ -ఫోర్ మోటార్స్ సైకిల్స్ లలో ఇది తొలిసారి అమలవుతుంది.
Read Also: TVS Ntorq 150: ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లతో రాబోతున్న టీవీఎస్ ఎన్టోర్క్..!
ఈ E-Clutch సిస్టమ్ అంటే.. వినియోగదారులు క్లచ్ లివర్ ఉపయోగించకుండానే గేర్లు మార్చడం, వాహనాన్ని ఆపడం, బండిని స్టార్ట్ వంటి చర్యలు చేయడానికి వీలు కల్పిస్తుంది. అయితే, అవసరమైతే మాన్యువల్ క్లచ్ వాడకాన్ని కూడా కొనసాగించవచ్చు. ఇది రైడింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తూ.. ట్రాఫిక్ లోనూ, లాంగ్ రైడ్స్ లోనూ మంచి అనుభూతిని ఇస్తుంది.
Read Also: Retired out: ఇదేందయ్యా ఇది.. జట్టులోని పదిమంది రిటైర్డ్ అవుట్.. ఎందుకంటే.?
CB650R E-Clutch వేరియంట్‌లో దాదాపు అన్ని డిజైన్, మెకానికల్ అంశాలు సాధారణ మోడల్‌లానే ఉంటాయి. స్టాండెడ్ బైక్, ఈ క్లచ్ రెండు వేరియంట్లు 649cc లిక్విడ్-కూల్డ్ ఇన్లైన్ -ఫోర్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటాయి. ఇది 95 హెచ్‌పీ @ 12,000rpm వద్ద, 63Nm @ 9,500rpm వద్ద టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక గేర్‌బాక్స్ విషయానికొస్తే.. రెండింటిలోనూ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ముఖ్యమైన తేడా కేవలం క్లచ్ ఆపరేషన్ పద్ధతిలో మాత్రమే ఉంటుంది.
ఇండియన్ మార్కెట్ కోసం హోండా ఇంకా E-Clutch వేరియంట్ ధరను ప్రకటించలేదు. అయితే, ప్రస్తుత సాధారణ CB650R మోడల్ ధర రూ. 9.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, E-Clutch వేరియంట్ అంతర్జాతీయంగా దాదాపు రూ. 20,000 ఎక్కువగా ఉంటోంది. భారతదేశంలో కూడా దీని ధర సాధారణ వేరియంట్ కంటే కొంచెం ఎక్కువగానే ఉండనుంది.