HMDA: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విలువైన భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) తాజాగా ఈ-వేలం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్ లేఅవుట్‌లో మొత్తం 12 ప్లాట్లు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని బాచుపల్లి లేఅవుట్‌లో 70 ప్లాట్లు, అలాగే రంగారెడ్డి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 4 ప్లాట్లు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో మరో 7 ప్లాట్లు వేలం ద్వారా అమ్మకానికి ఉంచనున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది.
Raja Singh : మార్వాడి గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్‌ల కుట్ర
ఈ వేలం తేదీలను కూడా స్పష్టంగా ప్రకటించారు. తుర్కయాంజాల్ లేఅవుట్‌లో సెప్టెంబర్ 16, బాచుపల్లి లేఅవుట్‌లో సెప్టెంబర్ 17, ఇతర ప్రాంతాల్లో సెప్టెంబర్ 18న వేలం జరగనుంది. రిజిస్ట్రేషన్ కోసం కూడా అదే తేదీలను చివరి గడువుగా నిర్ణయించారు. ఈ భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం రాబట్టడంతో పాటు, పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన అవకాశాలు లభించే అవకాశముంది.
Barabar Premistha : బరాబర్ ప్రేమిస్తానంటున్న యాటిట్యూడ్ స్టార్