కర్ణాటకలో ఇటీవల కాలంలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. గత కొన్ని నెలలుగా హిజాబ్ వివాదం కర్ణాటకలో నానుతూనే ఉంది. హైకోర్ట్ విద్యాలయాల్లోకి హిజాబ్ ధరించి రావడానికి వ్యతిరేఖంగా తీర్పు చెప్పింది. అయినా కూడా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి. మండ్యా, శివమొగ, ఉడిపి, చిక్ బళ్లాపూర్, మైసూర్, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈ వివాదంతో పాఠశాలల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా హిజాబ్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
ప్రస్తుతం మాండ్యాలోని జామియా మసీదు, మంగళూర్ లోని జుమా మసీదు వ్యవహారం తెరపైకి వచ్చింది. గతంలో ఈ రెండు మసీదులు దేవాలయాలని…టిప్పు సుల్తాన్ హాయాంలో కూల్చేసి మసీదులుగా మార్చారని హిందు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల మంగళూర్ జుమా మసీదులో దేవాలయానికి సబంధించిన నిర్మాణం వెలుగులోకి రావడంతో ఉద్రికత్తత తలెత్తింది.
ఇదిలా ఉంటే మరోసారి కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ముస్లిం మహిళతో సంబంధం పెట్టుకున్నాడని.. 25 ఏళ్ల హిందూ యువకుడిని కిరాతంగా హతమార్చారు. ఈ ఘటన కలబురిగిలో చోటు చేసుకుంది. దీంతో కలబురిగి జిల్లాలో పోలీసులు భద్రతను పెంచారు. ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు.
కులబురిగి జిల్లా వాడి పట్టణానికి చెందిన విజయ్ కాంబ్లే, స్థానికంగా ఉన్న ముస్లిం యువతితో రిలేషన్ లో ఉన్నాడు. అయితే వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకున్నారని అయితే కుటుంబ సభ్యులు మాత్రం దీనిని వ్యతిరేఖించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే విజయ కాంబ్లేను సోమవారం రాత్రి స్థానికంగా ఉన్న రైల్వే బ్రిడ్జి వద్ద పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. అమ్మాయి తండ్రి, సోదరుడు తన కుమారుడు విజయ కాంబ్లేను హత్య చేసినట్లు తల్లి ఫిర్యాదు చేసింది. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందుతులను మస్లిం యువతి సోదరులు షహబుద్దీన్, నవాజ్ గా గుర్తించారు.