అనంతపురం ఏపీలో కీలక రాజకీయాలకు వేదిక. అలాంటి అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రాప్తాడు రాజకీయాలకు అనంత క్లాక్ టవర్ వేదికగా మారింది. టిడీపీ -వైసీపీ నేతల మద్దతుదారులు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు రాజకీయ వేడిని రాజేశాయి. వైసీపీ మద్దతు దారుడు గతంలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ పోస్ట్ చేసి క్లాక్ టవర్ వద్దకు రావాలని సవాల్ విసిరాడు. దీంతో పరిటాల వర్గీయులు పెద్దఎత్తున క్లాక్ టవర్ వద్దకు చేరుకోవడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
రాప్తాడులో ఎవరు అభివృద్ధి చేశారన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఒకరు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరికొందరు పరిటాల కుటుంబం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం వచ్చి మాట్లాడాలంటా టీడీపీ మద్దతుదారుడు సవాల్ విసిరాడు. నేను రాప్తాడు, అనంతపురం వచ్చానంటూ వైసీపీ మద్దతుదారుడు వీడియో రిలీజ్ చేయడంతో అసలు రచ్చ మొదలైంది. రాప్తాడులో పరిటాల వర్సెస్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిల మధ్య వార్ గుంటూరుకు చేరింది. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మా నేత గొప్ప అంటే మా నేత గొప్ప అంటూ సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకున్నారు. పరిటాల కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అటు వైపు వ్యక్తి దమ్ముంటే రాప్తాడు వెళ్లి మాట్లాడు అంటూ సవాల్ విసిరారు. గుంటూరు జిల్లాలో ఉండి మాట్లాడటం కాదు.. రాప్తాడుకు వస్తే ఎవరు ఏంటో తెలుస్తుందంటూ సవాల్ విసిరాడు.
Read Also: Project K: యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ లో అమితాబ్ కి ప్రమాదం…
దీంతో ఇటు వైసీపీకి అనుకూలంగా వ్యక్తి నేను వస్తానంటూ నువ్ రా అంటూ ప్రతి సవాల్ విసిరాడు. అయితే ఇవాళ రాప్తాడుకు సదరు గుంటూరు వ్యక్తి వచ్చాడు. నేను రాప్తాడు వచ్చాను.. మీ పరిటాల వారు దేవుని భూమి కబ్జా చేసి టీడీపీ కార్యాలయం కట్టిన విషయం చూడండి అంటూ వీడియో రిలీజ్ చేశాడు. అలాగే జాకీ పరిశ్రమ స్థలం వద్దకు కూడా వెళ్లి 150కోట్ల భూమిని జాకీకి ఇచ్చారని.. కనీసం ఇక్కడ పాకలు కూడా లేవంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఇది మీ వాళ్ల నిజస్వరూపం.. అనంతపురం టవర్ క్లాక్ దగ్గరకు, రాప్తాడుకు వచ్చి చెబుతున్నానంటూ ఆ వ్యక్తి కామెంట్స్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ గుమికూడిన వారిని పోలీసులు తరలించారు.
Read Also: Kushi: లవ్ స్టొరీ కదా సార్… పీటర్ హెయిన్స్ తో ఫైట్ ఎందుకు?