న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట తర్వాత భారతీయ రైల్వే కీలకమైన చర్యలు తీసుకోనుంది. దేశవ్యాప్తంగా 60 రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో శాశ్వత హోల్డింగ్ జోన్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి కమిటీ వేసింది. ఉన్నత స్థాయి కమిటీలో నార్త్ రైల్వేస్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ దేవ్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ కమిషనర్ పంకజ్ గంగ్వార్‌లు ఉన్నారు. కాగా.. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది.
శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. తొక్కిసలాటలో మరణించిన ఐదుగురి పోస్ట్‌మార్టం నివేదికలు వెలువడ్డాయి. నివేదిక ప్రకారం.. ఈ ఐదుగురు "ట్రామాటిక్ అస్ఫిక్సియా" కారణంగా మరణించారని తేలింది. ఇది ఛ