AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది. భూవివాదం , కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన కఠిన ఉత్తర్వులపై రంగనాథ్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధిస్తూ సస్పెండ్ చేసింది.
అసలు వివాదంలోకి వెళ్తే.. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్కు చెందిన స్థలంలో హైడ్రా చేపట్టిన చర్యలు , నిబంధనల ఉల్లంఘనపై న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై తీవ్రంగా పరిగణించిన సింగిల్ జడ్జి రంగనాథ్‌కు జరిమానా విధించడంతో పాటు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, ఈ తీర్పుపై రంగనాథ్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చి ఊరట లభించింది.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
మరోవైపు ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రంగనాథ్‌కు, హైడ్రాకు పూర్తి మద్దతుగా నిలిచారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా చట్టబద్ధంగానే బాధ్యతాయుతంగా పనిచేస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే, ఆక్రమణదారులపై చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని, హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని రేవంత్ స్పష్టం చేశారు. హైడ్రా ఐపీఎస్ అధికారి రంగనాథ్ నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తోందని, నిబంధనల ప్రకారమే ప్రతి చర్య ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!