BJP : బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోవచ్చని న్యాయస్థానం తీర్పునిచ్చింది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం లో ప్రభుత్వం వైఫల్యం పై మహా ధర్నా చేయనుంది బీజేపీ. అయితే.. ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ శ్రేణులు. దీంతో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. అయితే.. ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ప్రభుత్వ తరుపు న్యాయ వాది హైకోర్టు ముందు వాదనలు వినిపించారు.
Also Read : Baby Collections: బేబీ మూవీ అనూహ్యమైన రికార్డు
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
దీంతో.. కేంద్రం ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా ? అని ప్రశ్నించింది న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించిన న్యాయస్థానం… 5వేల మందికి మీరు భద్రత కల్పించలేక పోతే ఎలా అని ప్రశ్నించింది. దీంతో.. రేపటి బీజేపీ మహాధర్నాకు 500 మంది మాత్రమే ధర్నా లో పాల్గొనాలని, ఎలాంటి ర్యాలీ లు చెప్పటవద్దని సూచించింది హైకోర్టు. పోలీసులు అనుమతి నిరాకరించడంపై హై కోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వేరే కారణాల చూపుతూ ఎందుకు ధర్నా కు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించింది హైకోర్టు.. 1000 మంది వస్తారని, ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న కారణంగా అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వం తరుఫు న్యాయవాది వెల్లడించారు.
Also Read : Baby Collections: బేబీ మూవీ అనూహ్యమైన రికార్డు
1000 మందికే భద్రత ఇవ్వలేకుంటే 1 కోటి మందిని ఎలా కాపాడుతారని హై కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం పై ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయని, అలాంటప్పుడు ఎలాంటి అభ్యంతరాలు చెప్పరని, ప్రతిపక్షాలు ధర్నా చేసేటప్పుడు మాత్రమే అన్ని అభ్యంతరాలు పెడుతున్నారని, ఒక కేబినెట్ మినిస్టర్ ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఎలా అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!