Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government Schemes: రైతు సంక్షేమాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక విశేషమైన పథకాలను అమలు చేస్తోంది. వీటిలో కొన్ని పథకాలు రైతులకు నేరుగా ఆర్థిక సాయాన్ని అందిస్తుంటే, మరికొన్ని పథకాలు వృద్ధాప్యంలో పెన్షన్ ఆసరాను, అలాగే సాగు ఖర్చుల కోసం అత్యంత సులభంగా తక్కువ వడ్డీకే రుణ సదుపాయాన్ని చేకూరుస్తున్నాయి. అయితే, సరైన సమాచారం లేకపోవడం వల్ల ఇప్పటికీ ఎంతోమంది అర్హులైన రైతులు ఈ ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. మీరు కూడా వ్యవసాయం చేస్తున్నట్లయితే, మీకు ఎంతగానో ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వానికి చెందిన మూడు అద్భుతమైన పథకాల వివరాలు తప్పక తెలుసుకోవాలి. అవే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC).
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి..
దేశంలో రైతులకు అత్యంత ప్రజాదరణ పొందిన పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) మొదటి వరుసలో ఉంటుంది. సాగు భూమి ఉన్న అర్హులైన రైతులకు ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.6,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే ప్రభుత్వం జమ చేస్తుంది. వ్యవసాయ అవసరాలతో పాటు ఇంట్లోని చిన్న చిన్న ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి రైతులకు అదనపు ఆసరాగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
Also Read
- Samantha: సమంత, రాజ్ దంపతులకు పండంటి మగబిడ్డ.. ముద్దుల కుమారుడి పేరు ఇదే..
- CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
- BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన..
చిన్న, చిన్నకారు రైతులకు వృద్ధాప్యంలో కొండంత ఆర్థిక భద్రతను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన’ను ప్రారంభించింది. ఈ పథకంలో చేరిన అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉండి, గరిష్టంగా 2 హెక్టార్ల వరకు మాత్రమే సాగుభూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. పథకంలో చేరిన వయస్సును బట్టి రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు తమ కాంట్రిబ్యూషన్‌గా చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలనెలా రూ.3,000 స్థిరమైన పెన్షన్ పొందాలనుకునే రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్..
వ్యవసాయం చేసే సమయంలో విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల, క్రిమిసంహారక మందులు, కూలీల ఖర్చులు, ఇతర సాగు పనుల కోసం రైతులకు భారీగా డబ్బు అవసరమవుతుంది. అలాంటి సమయంలో రైతులకు చౌకగా, చాలా సులభంగా రుణాలు అందించడానికి ‘కిసాన్ క్రెడిట్ కార్డ్’ (KCC) సహాయపడుతుంది. ఈ పథకం ద్వారా రైతులు వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. కేవలం పంటల సాగుకే కాకుండా పశుపోషణ, డైరీ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ వంటి రంగాలలో ఉన్న అర్హులైన లబ్ధిదారులు కూడా కేసీసీ ద్వారా రుణ సదుపాయాన్ని పొందేందుకు అవకాశం ఉంది. ఈ పథకం కింద లభించే రుణ పరిమితి అనేది రైతుకు ఉన్న భూమి, పంటల నమూనా, సాగు ఖర్చు, ఆర్థిక అవసరాల ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది. బ్యాంకులు ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత క్రెడిట్ లిమిట్‌ను ఖరారు చేస్తాయి. అర్హులైన రైతులకు ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు రుణం లభించే వెసులుబాటు ఉంది. దీనివల్ల వ్యవసాయ పనులకు అవసరమైన పెట్టుబడిని సులభంగా సమకూర్చుకోవచ్చని, అలాగే వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన అవసరం ఎంతగానో తగ్గుతుంది.
తాజావార్తలు
-
Samantha: సమంత, రాజ్ దంపతులకు పండంటి మగబిడ్డ.. ముద్దుల కుమారుడి పేరు ఇదే..
-
Shiva Kandukuri Marriage: టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి.. పెళ్లిపీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో!
-
Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
-
CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!