Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Hit-and-Run: హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. 3 ఏళ్ల పసి బాలుడు ఇజాన్ ఉద్దీన్ తన తండ్రి మొహిదుద్దీన్ సాహెబ్‌తో కలిసి స్వీకార్ హోటల్ నుంచి పార్సెల్ తీసుకురావడానికి వెళ్లగా, అదే సమయంలో వేగంగా వచ్చిన ఒక కారు బాలుడిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారుతో అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన పసి బాలుడు ఇజాన్ ఉద్దీన్‌ను వెంటనే షాలిని ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే, బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు కారును గుర్తించారు. కారు నడిపింది ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు. ప్రస్తుతం కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటనలో మూడేళ్ళ చిన్నారి ఇజాన్ కుటుంబ సభ్యులు ఎన్టీవీతో మాట్లాడారు. “డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న వ్యక్తి చాలా స్పీడ్‌గా, ర్యాస్ డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు. దాదాపు 15 ఫీట్ల వరకు మూడేళ్ల బాబుని ఈడ్చుకొని వెళ్ళాడు. పోలీసులు కారు నడిపింది ఎవరంటే పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడం లేదు. మాకు న్యాయం జరగాలి. ఇంత టెక్నాలజీ ఉందని చెబుతున్నారు, కాని ఇప్పటివరకు కారు నడిపింది ఎవరనేది పోలీసులు గుర్తించలేదు. ఇంకా ఎంతమంది ఇలాంటి ఘటనలతో ప్రాణాలు కోల్పోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన శిక్షలు అమలు చేయాలి.” అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
తాజావార్తలు
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!