Baby Movie Collections create new record: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం బేబీ. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల దర్శకుడు సాయి రాజేష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జులై 14న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే 66 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. అయితే తాజాగా కలెక్షన్లలో దూసుకెళ్తున్న ‘బేబీ’ సినిమా మరో అరుదైన రికార్డు సృష్టించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో 10వ రోజు రూ.3.40 కోట్లు వసూలు చేసి మిడ్ రేంజ్ సినిమాల్లో అత్యధిక షేర్ సాధించిన మూవీగా ఈ సినిమా నిలిచింది.
Sai Rajesh: ఆ కారణంగా బేబీ సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి ని తీసుకున్నాము.
RRR, బాహుబలి-2, వాల్తేరు వీరయ్య, బాహుబలి, ధమాకా, రంగస్థలం, అల వైకుంఠపురంలో, పుష్ప లాంటి స్టార్ హీరోల భారీ చిత్రాలు మాత్రమే బేబీ సినిమా కంటే ముందున్నాయి మరే టైర్ 2 హీరోల సినిమాలు సైతం ఆ లిస్టులో లేకపోవడం గమనార్హం. ఇక మొత్తంగా చూసుకుంటే ‘బేబీ’కి 10 రోజుల్లో రూ.66.6 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సినిమా యూనిట్ తిరుమల శ్రీవారిని సందర్శించి అనంతరం తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇక ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, గుంటూరులో సక్సెస్ టూర్ కూడా నిర్వహించింది. బేబీ సినిమాని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద డైరెక్టర్ మారుతి, నిర్మాత ఎస్ కే ఎన్ సంయుక్తంగా నిర్మించారు.