హైకోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో మరోసారి హైకోర్టుకు చేరుకున్నారు. కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్.. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు లాయర్‌ను అనుమతించాలని కోరారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరపనున్నారు.
READ MORE: Assam Coal Mine: బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికులు.. ఒక్కసారిగా 100 అడుగులు పెరిగిన నీరు!
ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత, ఆ తీర్పుపై న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించుకున్నారు.
READ MORE: Gold Rate Today: పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
ఇదే సమయంలో, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో, తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్‌ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్‌గా దాఖలు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో పరిస్థితులు గంటగంటకూ మారిపోతున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో ఇది మరింత హాట్ హాట్ టాపిక్‌గా మారింది.