High Court: విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సాగింది.. అయితే, ప్రభుత్వం కేవలం ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం మాత్రమే విశాఖలో ఏర్పాట్లు చేస్తున్నట్టు హైకోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. కానీ, అమరావతిలో ఉన్న కార్యాలయాల కంటే భారీ స్థాయిలో శాశ్వత నిర్మాణాలు విశాఖలో చేస్తున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. దీంతో, ప్రజాధనం వృథా అవుతుందని.. అందుకే ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలింపుపై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు పిటిషనర్.. అయితే, కేసును ఫైల్ బెంచ్ కు బదిలీ చేస్తానని, అప్పటి వరకు స్టేటస్ కో ఇస్తామని హైకోర్టు చెప్పింది.. ఇదే సమయంలో సమయం కావాలని హైకోర్టును కోరింది ప్రభుత్వం.. దీంతో, విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.. ఈ లోపు ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, గతంలో R5 జోన్ విషయంలో ఇలానే ఒకరోజుకి సీఎం కార్యక్రమ పేరిట 3 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని కోర్టుకు తెలిపారు పిటిషనర్..
Read Also: Vasantha Krishna Prasad: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక నిర్ణయం.. రంగంలోకి వైసీపీ అధిష్టానం
కాగా, సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. మూడు రాజధానులు తెరపైకి తెచ్చిన విషయం విదితమే.. అందులో భాగంగా.. విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.. ఇప్పటికే విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లలో మునిగిపోయింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఇదివరకే విశాఖకు రాజధాని తరలివెళ్లాల్సి ఉండగా.. నిర్మాణాల్లో జాప్యం కారణంగా అది వాయిదా పడుతూ వచ్చిన విషయం విదితమే.