బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 9 సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కార్యక్రమంకు సంబందించిన ప్రోమోలు సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ సీజన్లో కామన్ మ్యాన్ కాన్సెప్ట్ మరలా వచ్చింది. ‘అగ్ని పరీక్ష’ ద్వారా 15 మంది సామాన్యులను ఎంపిక చేసి.. ఓటింగ్‌లో పెట్టారు. వీరిలో 5 మంది బిగ్ బాస్ హౌస్ లోపలకు వెళ్లనున్నారు. వారెవరన్నది బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ వరకు ఎవరికి తెలియకుండా సస్పెన్స్‌లో ఉంచారు బిగ్‌బాస్ యాజమాన్యం.
ఎప్పటిలాగే పలువురు వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు ఈసారి హౌజ్‌లోకి అడుగు పెట్టనున్నారు. అందులో కొందరు హీరోయిన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ఆశా శైనీ’ అలియాస్ ఫ్లోరా శైనీ ఈసారి హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్. అయితే ఆమెతో పాటు మరో హీరోయిన్ ‘సంజనా గల్రానీ’ పేరు కూడా వినిపిస్తోంది.
Also Read: Tallest Ganesh Idol: దేశంలోనే అత్యంత ఎత్తైన గణనాథుడు.. అందరిచూపు ఇప్పుడు అనకాపల్లి పైనే!
2005లో ‘సోగ్గాడు’ సినిమాతో సినిమాలోకి ఎంటరైన సంజనా గల్రానీ.. కన్నడ, తెలుగు, తదితర బాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడతో పాటు వివిధ భాషల్లో సంచలన విజయం సాధించిన ‘దండుపాళ్యం’ సినిమాలో నెగెటివ్ పాత్రతో అందరినీ భయపెట్టింది. కరోనా టైమ్లో ఓ డ్రగ్స్ కేసులో సంజన అరెస్ట్ అయ్యింది. మూడు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చింది. అప్పట్లో సంజనా అరెస్ట్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. అదే ఏడాది బెంగుళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు. సంజనా బిగ్ బాస్‌లోకి వస్తుందో.. రాదో తెలియాలంటే షో మొదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.