Kadambari Jethwani: నన్ను ఆటబొమ్మలా వాడుకున్నారు.. సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందజేస్తా: హీరోయిన్
- ఆటబొమ్మలా వాడుకున్నారు
- సాక్ష్యాలను పోలీసులకు అందజేస్తా
- ఏపీ ప్రభుత్వంపై నమ్మకం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heroine Kadambari Jethwani Press Meet: తనను గత ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు ఆటబొమ్మలా వాడుకున్నారని హీరోయిన్ జిత్వాని తెలిపారు. అప్పట్లో తనను చిత్రహింసల గురి చేసిన గత ప్రభుత్వ వ్యక్తులపై కేసు వివరాలను, తన వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందజేస్తానన్నారు. ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. విజయవాడ పోలీసులు తనతో మాట్లాడారని, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశానని జిత్వాని చెప్పారు.
గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో హీరోయిన్ జిత్వాని మాట్లాడుతూ… ‘అప్పట్లో నన్ను చిత్రహింసల గురి చేసిన గత ప్రభుత్వ వ్యక్తులపై కేసు వివరాలను, నా వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందజేస్తాను. ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం నాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది. విజయవాడ పోలీసులు నాతో మాట్లాడారు, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాను. నాపై 2014లో మల్టిపుల్ క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నన్ను గత ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు అట బొమ్మలా వాడుకున్నారు. చట్ట వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కొందరు నన్ను, నా కుటుంబాన్ని చిత్ర హింసలకు గురిచేశారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలి. ఎవరికీ ఇలా జరగకూడదు. ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలి. నాపై ఫిర్యాదు చేసిన వ్యక్తులు బయట ప్రశాంతంగా తిరుగుతున్నారు’ అని అన్నారు.
Also Read
- Putin: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
- PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
- Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
‘ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టి అనేక విధాలుగా వేధించారు. నాపై అక్రమ కేసులు పెట్టి వేధించిన అధికారులకు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఉన్న ఆధారాలన్నిటినీ ఏపీ ప్రభుత్వానికి అందిస్తాను. నా కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాను. సోషల్ మీడియాలో కొందరు నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. డబ్బుల కోసమే మాట్లాడుతున్నానని నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు. నాకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఏపీ ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది, నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’ అని హీరోయిన్ జిత్వాని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Putin: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
-
Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!