Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood vs Kollywood: సినిమాకు భాషా సరిహద్దులు ఉండవని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. కథ బాగుంటే, నటన సహజంగా ఉంటే, మేకింగ్ ఆకట్టుకుంటే ఏ భాష ప్రేక్షకులైనా సినిమాను ఆదరిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తమిళ స్టార్ హీరోలకు లభిస్తున్న ఆదరణ చూస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతోంది. తెలుగులో అజిత్, విజయ్, సూర్య, కార్తీ వంటి హీరోలకు ప్రత్యేక మార్కెట్ ఉంది. తెలుగులో డబ్బింగ్ సినిమాలకు మంచి థియేటర్లు దక్కడంతో పాటు.. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఇప్పుడు సాధారణంగా మారింది.
తెలుగులో తమిళ హీరోల జోరు..
తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పాటు వసూళ్ల పరంగానూ సత్తా చాటినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరిగింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ మరోసారి స్పష్టమైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా తర్వాత సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలోనూ తెలుగు మార్కెట్‌పై ఆసక్తికరమైన చర్చ జరిగింది. తమిళనాడుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయనే ప్రచారం సినీ వర్గాల్లో సాగింది. దీంతో కోలీవుడ్ హీరోలకు టాలీవుడ్ మార్కెట్ ఎంత కీలకంగా మారిందో మరోసారి చర్చకు వచ్చింది. సూర్య తర్వాత ఆయన తమ్ముడు కార్తీ కూడా ‘సర్దార్ 2’తో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ‘సర్దార్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కి తెలుగులో మంచి రెస్పాన్స్ రావడంతో సీక్వెల్‌పైనా అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- Tollywood: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలివే
- Tollywood: 2027 సంక్రాంతి బాక్సాఫీస్ యుద్ధం.. బరిలో ఏడు సినిమాలు
- Pa.Ranjith: రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు.. అణగారిన వర్గాల గొంతుక! పా.రంజిత్ ట్వీట్ వైరల్..
- Adarsha Kutumbam OTT Release: ఓటీటీలోకి వెంకీ మామ మాస్ జాతర.. రేపటి నుంచే ‘ఆదర్శ కుటుంబం’ సందడి!
మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా
ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వస్తోంది. తమిళ హీరోలు తెలుగు రాష్ట్రాల్లో తమ సినిమాలను చాలా సింపుల్‌గా మార్కెట్ చేసుకుంటున్నప్పుడు.. టాలీవుడ్ హీరోలకు కోలీవుడ్‌లో అదే రేంజ్లో మార్కెట్ ఉందా? అనే చర్చ స్టార్ట్ అయ్యింది. తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నప్పటికీ.. తమిళ మార్కెట్లో మాత్రం ప్రతిసారీ ఆశించిన స్థాయిలో రిజల్ట్ రావడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా చిత్రాల పరిస్థితితో పాటు.. గతంలో విడుదలైన కొన్ని పలు భారీ చిత్రాలను పరిశీలిస్తే ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యత్యాసంపై టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇతర భాషల సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్న ప్రోత్సాహంతో పోలిస్తే.. తమిళనాడులో తెలుగు చిత్రాలకు అదే స్థాయిలో ఆదరణ, అవకాశాలు లభించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తన ‘క’ సినిమా విడుదల సమయంలో, అలాగే ‘చెన్నై లవ్ స్టోరీ’ సమయంలో కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు కిరణ్ అబ్బవరం చెప్పారు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో తెలుగు సినిమాలకు థియేటర్లు కేటాయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన కామెంట్స్ చేశారు. దీంతో తెలుగు – తమిళ సినీ మార్కెట్ల మధ్య ఉన్న వ్యత్యాసంపై మరోసారి చర్చ మొదలైంది. మొత్తంగా చూస్తే.. తెలుగు ప్రేక్షకులు సూర్య, కార్తీ, అజిత్, విజయ్ వంటి తమిళ హీరోలను తమ హీరోల్లాగే ఆదరిస్తున్నారు. మరి తమిళ ప్రేక్షకులు తెలుగు హీరోలకు అదే స్థాయిలో అవకాశాలు, ఆదరణ ఎప్పుడు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రెండు పరిశ్రమల మధ్య పోటీతో పాటు పరస్పర ఆదరణ కూడా పెరిగితే.. చివరికి దాని ప్రయోజనం దక్షిణాది సినీ ప్రేక్షకులకే దక్కుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారికి వర్ధమాన్ జైన్ దంపతులు అందించిన బంగారు ఆభరణాల వివరాలు ఇవే..
-
Tollywood: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలివే
-
SEBI: కీలక నిర్ణయం తీసుకున్న సెబీ.. కేవైసీ నిబంధనల్లో మార్పులు..
-
YS Jagan: రాయలసీమ లిఫ్ట్ స్కీంపై రాజకీయ రగడ.. వాస్తవాలు వెల్లడించిన జగన్..
-
Sheikh Hasina: ‘‘హసీనాకు ఏమైనా జరిగితే..’’ బంగ్లాదేశ్ ప్రధానికి మాజీ అమెరికన్ అధికారి హెచ్చరిక!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!