సినీనటి జెత్వానీ కేసులో కొత్త కొత్త ట్విస్ట్‌లు ఉంటాయా? ఇంకొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ మెడకు చుట్టుకోబోతోందా? ఈ ఎపిసోడ్‌లో మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి పేరు ఎందుకు వస్తోంది? ఇప్పటికే సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్‌లు మరికొన్ని కేసుల్లో కూడా ఇరుక్కోబోతున్నారన్నది నిజమేనా? అసలు జెత్వానీ కేసు కేంద్రంగా జరగబోతున్న కొత్త పరిణామాలు ఏంటి? సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీకి చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యారు. అది కూడా ఆమెను కేసులతో…
ముంబై నటి జత్వాని కేసు సంచలనం సృష్టిస్తోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంలో చర్యలకు కూడా దిగింది ప్రభుత్వం.. అయితే, మరోమారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు సినీ నటి జత్వాని.. రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారామె.. దీంతో.. ఈ రోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు..
Heroine Kadambari Jethwani Press Meet: తనను గత ప్రభుత్వ పెద్దలు, పోలీస్ అధికారులు ఆటబొమ్మలా వాడుకున్నారని హీరోయిన్ జిత్వాని తెలిపారు. అప్పట్లో తనను చిత్రహింసల గురి చేసిన గత ప్రభుత్వ వ్యక్తులపై కేసు వివరాలను, తన వద్ద ఉన్న సాక్ష్యాలను ఏపీ పోలీసులకు అందజేస్తానన్నారు. ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. విజయవాడ పోలీసులు తనతో మాట్లాడారని, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశానని జిత్వాని చెప్పారు. గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో హీరోయిన్…