Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’
- దేశవ్యాప్తంగా సేఫ్టీ ఆడిట్లకు ఆదేశాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్‌లో పీజీ హాస్టల్ భవనం కూలి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాసుల కక్కుర్తితో కొందరు యజమానులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇష్టానుసారంగా భవంతులు నిర్మించి ప్రాణాలు తీస్తున్నారు. ఢిల్లీ ఘటనలో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
తాజాగా ఈ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు నివసించే పీజీలు, ప్రైవేట్ హాస్టళ్లు, స్టూడెంట్ అకామడేషన్ల భద్రతపై విస్తృత స్థాయిలో ఆదేశాలు జారీ చేసే అంశాన్ని పరిశీలించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం సంకేతాలు ఇచ్చింది. ఈ కేసును సెప్టెంబర్ 10న విచారించనున్నట్లు తెలిపింది. మంగళవారం జరిగిన విచారణలో.. ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విద్యార్థుల వసతి గృహాల భద్రతకు సంబంధించిన అంశాలను కూడా పరిధిలోకి తీసుకురావచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
Also Read
- India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
- INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
- UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
- Amitabh Bachchan: ‘‘బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడదు’’.. అమితాబ్ బచ్చన్‌కు గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు..
సత్య నికేతన్ ఘటనపై విచారణ
ప్రస్తుతం అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. ఈ కేసులో కోర్టు నియమించిన అమికస్ క్యూరీ అజిత్ కుమార్ సిన్హా.. ఢిల్లీలోని ప్రైవేట్ హాస్టళ్లు, పీజీ అకామడేషన్లపై సమగ్ర భద్రతా ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. సత్య నికేతన్ ఘటన విద్యార్థుల వసతి భద్రతపై ఉన్న విస్తృత సమస్యలను బయటపెట్టిందని ఆయన తెలిపారు. చాలా పీజీలు, ప్రైవేట్ హాస్టళ్లు నివాస భవనాల్లోనే నిర్వహిస్తున్నారని.. వాటిలో నిర్మాణపరమైన మార్పులు, భవనం వినియోగంలో మార్పులు లేదా అనుమతి లేని నిర్మాణాలు జరిగే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
‘దేశవ్యాప్తంగా ఆదేశాలు ఇస్తాం’
ఢిల్లీ పరిపాలన తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సత్య నికేతన్ భవనం కూలిన ఘటనను “భయానక ఘటన”గా అభివర్ణించారు. ఈ ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ఎంసీడీ అధికారుల పాత్రపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిందని తెలిపారు. అలాగే ఢిల్లీలోని పీజీలపై నగరవ్యాప్తంగా భద్రతా ఆడిట్ నిర్వహించాలని కూడా హైకోర్టు ఆదేశించిందని వివరించారు. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని తుషార్ మెహతా సూచించారు.
అయితే ఈ సూచనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. “మేము దీనిని బదిలీ చేయడం లేదు. పరిధిని విస్తరిస్తాం. దేశవ్యాప్తంగా (Pan-India) ఆదేశాలు జారీ చేస్తాం. మా మనసులో ఒక విషయం ఉంది” అని జస్టిస్ అమానుల్లా వ్యాఖ్యానించారు.
సత్య నికేతన్‌లో ఏం జరిగింది?
ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న బాలుర పీజీ ఉన్న ఐదు అంతస్తుల భవనం ఇటీవల కూలిపోయింది. ఈ ఘటనలో విద్యార్థులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ప్రాథమిక దర్యాప్తులో భవనంలో అనుమతి లేని మార్పులు, బేస్మెంట్లో పనులు, దశాబ్దాల నాటి భవనం నిర్మాణ బలహీనత వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో భవనం యజమానిని అరెస్టు చేయగా.. ఎంసీడీకి చెందిన కొందరు అధికారులను సస్పెండ్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పీజీలు, హాస్టళ్లపై ఢిల్లీ హైకోర్టు ఆడిట్
మరోవైపు ఢిల్లీ హైకోర్టు కూడా నగరంలోని పీజీలు, హాస్టళ్లపై వారం రోజుల్లో భద్రతా ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. సత్య నికేతన్ విషాదానికి భవనం యజమాని మాత్రమే బాధ్యుడిగా ఉండకపోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. విద్యార్థుల వసతి గృహాల పర్యవేక్షణ బాధ్యత ఉన్న పౌర సంస్థలు, సంబంధిత అధికారుల పాత్ర కూడా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
-
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
-
India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
-
Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
-
Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!