Hero Suman React on AP Politics: రాజకీయ నాయకులను అవినీతి పరుల్ని చేసింది ప్రజలే అని హీరో సుమన్ అన్నారు. అన్ని పార్టీల నాయకుల వద్ద డబ్బులు తీసుకుని వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తున్నారన్నారు. ఐదు సంవత్సరాలు బాగుండాలి అంటే.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సుమన్ సూచించారు. ఏపీ రాజకీయాలు తనకు అవసరం లేదని, అతను తెలంగాణలో ఉంటున్నాను అని సుమన్ చెప్పుకొచ్చారు.
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఇలా ఆడుతాడని అస్సలు ఊహించలేదు!
సోమవారం హీరో సుమన్ ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ… ‘రాజకీయాల్లోకి వచ్చినందు వలన ఉపయోగం లేదు. నేను సమాజ సేవలోనే ఉన్నాను. ఏపీ రాజకీయాలు నాకు అవసరం లేదు, నేను తెలంగాణలో ఉంటున్నాను. రాజకీయ నాయకులు దొంగలు అని ప్రజలు తిడుతున్నారు. అయితే రాజకీయ నాయకుల్ని అవినీతి పరుల్ని చేసింది ప్రజలే. అన్ని పార్టీల నాయకుల వద్ద డబ్బులు తీసుకుని.. వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చాలా మార్పులు వస్తాయి. ఐదు సంవత్సరాలు బాగుండాలి అంటే.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. నేను సెక్యులరిజం ఫాలో అవుతా’ అని చెప్పారు.