Canada : కెనడాలో భారీ దోపిడి జరిగింది. టొరంటో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల విలువైన బంగారం, ఇతర వస్తువులతో కూడిన కార్గో కంటైనర్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఏప్రిల్ 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టొరంటో ఎయిర్ పోర్టులో సోమవారం ఆరు చదరపు అడుగుల కంటైనర్‌ను విమానం నుంచి కిందకు జారవిడిచారు. అందులో దాదాపు 20 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారం, ఇతర వస్తువులు ఉన్నట్లు సమాచారం. కంటైనర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా అదృశ్యమైంది. ఈ చోరీకి సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు.
Read Also: Aishwarya Rai Daughter : హైకోర్టులో గెలిచిన ఐశ్వర్యరాయ్ కూతురు
కనపడకుండా పోయిన కంటైనర్ ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవరు రవాణా చేశారన్న వివరాలు వెల్లడించలేదు. ఘటన జరిగి మూడు రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఈ కంటైనర్ అదృశ్యం వెనుక కారకులు ఎవరనేది తెలియరాలేదు. ఇప్పుడే కాదు గతంలో కూడా కెనడా విమానాశ్రయంలో భారీ చోరీలు జరిగాయి. 1952లో టొరంటో విమానాశ్రయంలో 2.15 లక్షల డాలర్ల విలువైన బంగారం చోరీకి గురైంది. ప్రస్తుత విలువతో లెక్కిస్తే దాని విలువ 23 లక్షల డాలర్లకు సమానం. ఈ కేసు ఇంకా తేలలేదు. 1974లో కూడా ఒట్టావా ఎయిర్‌పోర్ట్‌లోని సేఫ్‌లో ఒక గార్డు తుపాకీతో బంగారాన్ని దొంగిలించాడు. దీని విలువ నేడు 4.6 మిలియన్ కెనడియన్ డాలర్లకు సమానం.