Dark Clouds Cover Hyderabad: ఇది మధ్యాహ్నమేనా? అనే విధంగా హైదరాబాద్‌ను మబ్బుల చీకట్లు కమ్ముతున్నాయి. నగర వాతావరణం.. మిట్ట మధ్యాహ్నం సాయంత్రాన్ని తలపిస్తోంది. ఆకాశమంతా మబ్బులతో కమ్మేయడంతో హైదరాబాద్ మసక బారింది. మరోసారి భారీ వర్షం తప్పదని కారు మబ్బులు సూచిస్తున్నాయి. కాగా.. సెలవు దినమవ్వడంతో ఇళ్లకే పరిమితమవ్వాలని బల్దియా అధికారులు సూచిస్తున్నారు.
Heavy Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, నేడు ఈ ద్రోణి మరింత బలపడడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గురువారం మధ్యాహ్నం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు నేడు, రేపు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.…
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది.. ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసిన ఐఎండీ… ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది… ఈ అల్పపీడన ప్రభావంతో.. ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలలు కురుస్తాయని ఐఎండీ వర్గాలు చెబుతున్నాయి… ఇప్పటికే విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి… వర్షానికి తోడు తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి… ఇక, ఐఎండీ ఎల్లో వార్నింగ్…