బీజేపీ నేత, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత కలిగింది. ఆదివారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో.. రాత్రి 10.50 గంటలకి ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ హస్పిటల్లో చేర్పించారు. కార్డియాక్ కేర్ యూనిట్ లో ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఆయన్నీ పర్యవేక్షించింది. అయితే.. కడుపులో గ్యాస్ సమస్య వల్ల ఆయనకు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Also Read : Whats Today ఈరోజు ఏమున్నాయంటే?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా.. కిషన్ రెడ్డి నిన్న ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ ప్రాంగణంలో జరిగిన.. మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీ ప్రస్తావించిన అంశాల ఆధారంగా అక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కలిసి కిషన్ రెడ్డి ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. ఆ తర్వాత మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు.
Also Read : Planes Collided : రెండు విమానాలు ఢీ..నలుగురు మృతి
తినే ఆహారంలో గ్యాస్ ఎక్కువైనప్పుడు.. అది పొట్టలోని పేగులు ఉబ్బిపోయేలా చేస్తుంది. ఆ గ్యాస్ బయటకు రాకుండా ఇబ్బంది పెడుతుంది. దాని వల్ల కడుపులో నొప్పి వస్తూ.. క్రమంగా ఛాతీ దగ్గర కూడా పెయిన్ రావడంతో.. అది గుండె నొప్పి కావచ్చని పొరపాటు పడతారు. అయితే.. గ్యాస్ తొలగిన తర్వాత ఈ నొప్పి కూడా పోతుంది. గుడ్లు, శనగలు, బీన్స్, బఠాణీలు, మీల్ మేకర్ వంటివి అధిక గ్యాస్ ఉత్తత్పి అయ్యేలా చేస్తాయి. అందువల్ల వాటిని ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు.