ముంబైలో వర్షం కురుస్తోంది. అక్కడి రోడ్లు, వీధులు, చౌరస్తాలన్నీ నీట మునిగాయి. అరేబియా సముద్రం ఉప్పొంగుతోంది. నీటి ప్రవాహం కారణంగా.. ముంబై హార్ట్‌లైన్ అంటే లోకల్ రైళ్లు ఆగిపోయాయి.
Rain Tax: బ్రిటీషర్ల కాలంలో వాళ్లు మనపై పలు రకాల పన్నులు వేశారంటే విని ఆశ్చర్యపోయాం. ఇప్పటికీ దేశంలో ఆదాయపు పన్ను, ఇంటిపన్ను, టోల్ వంటి అనేక పన్నులు సామాన్యుల జేబుకు భారంగా మారుతున్నాయి.
ఈరోజుల్లో డబ్బులను సంపాదించడం కన్నా ఖర్చులు అధికంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే.. దాంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఆదిమవుతున్నాయి. ఇంకొందరు ఎంత కష్టపడినా కూడా చేతిలో డబ్బులు వినడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలుగా సతమతమవడంతో పాటు అప్పు మీద అప్పు చేస్తూ ఉంటారు. అలా అప్పుల పాలు అవుతున్నవారు వర్షపు నీటితో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మరి ఆర్థిక సమస్యలు పోవాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు…
గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఉదయం.. మరికొన్ని చోట్ల సాయంత్రం ఆకాశానికి చిల్లుపడినట్లు వర్షం కురిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రం రాత్రి వేళ వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. నగరంలో కుండపోత వర్షం కురిసింది
చినుకు పడితే చాలు.. హైదరాబాద్‌లో కాలనీలు చెరువుల్లా మారతాయి. నాలాలు ఆక్రమణకు గురికావడం వల్ల నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతూ వుంటుంది. నాలాల అభివృద్ధితో వరదముంపునకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి తలసాని. ప్రతి ఏటా వర్షాకాలంలో వరదముంపుకు గురవుతున్న నాలా పరిసర కాలనీలలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టింది. మున్సిపల్ శాఖ మంత్రి KTR చొరవతో ముంపు సమస్య…
ఒక్క చెరువు వేలాదిమందిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తిరుపతి రాయలచెరువు తాజా దుస్థితికి వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయలోపమే కారణమంటున్నారు బాధిత గ్రామస్థులు. 10 రోజులు క్రితమే తూములు మూసివేతకు గురైన విషయాన్ని రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళారు ముంపు గ్రామాల ప్రజలు. రాయలచెరువు వరద ప్రవాహానికి తగ్గట్టుగా నీరు బయటకి వెళ్ళేలా అప్పట్లోనే నాలుగు తూములు ఏర్పాటు చేశారు రాయలవారు. నీటి నిల్వలు ఎక్కువగా వుండాలంటూ ఒక్కటిన్నర తూముని మూసివేశారు దిగువ గ్రామస్థులు.…
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని కొట్నూర్ వద్ద వర్షపు నీరు ఇళ్ళ లోకి చేరి చేనేత కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. నేషనల్ హైవే కాంట్రాక్టర్ అక్కడ ఉన్న కాలువను మట్టితో కప్పేయడం తో వర్షపు నీరంతా ఇళ్లల్లోకి చేరి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వర్షం పడిందంటే ఉపాధి కోల్పోయి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కోడూరు గ్రామానికి చెందిన కార్మికులు వాపోతున్నారు. తమ ఇంటి పక్కనే నేషనల్ హైవే పనులు జరుగుతుండడంతో ఉన్న ఇరిగేషన్ కాలువను మట్టితో…