ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురవడంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరి.. చెరువులను తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో కాజీపేట్ రైల్వే స్టేషన్(జంక్షన్)లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. రైల్వే పట్టాల పైకి నీరు రావడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.