వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రామన్న చెరువు కట్ట తెగింది. దీంతో.. 216వ నంబర్ ఒంగోలు, దిగమర్రు జాతీయ రహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. జాతీయ రహదారిపై దాదాపు అర కిలోమీటర్ మేర.. రోడ్డుపై దాదాపు మూడు అడుగుల వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో.. జాతీయ రహదారిపై వెళ్ళే వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఈ ఏడాది కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరదలు వస్తున్నాయి.. శ్రీశైలం రిజర్వాయర్ గేట్లను ఈ ఏడాదిలో ఈ రోజు నాల్గోసారి ఎత్తారు నీటిపారుదలశాఖ అధికారులు.. ఇన్‌ఫ్లో తగ్గడంతో బుధవారం రోజే శ్రీశైలం గేట్లను మూసివేశారు అధికారులు.. అయితే, మరోసారి క్రమంగా వరద ఉధృతి పెరడంతో.. ఈ రోజు శ్రీశైలం డ్యామ్‌లోని ఒక గేటును ఎత్తారు.. ఒక్క గేటును 10 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌కు నీటిని విడిచిపెడుతున్నారు..
బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.. బుడలేరు వరదకు దాదాపు 20 డ్రెయిన్ ల నుంచి వచ్చే వర్షం నీరు తోడు కావడంతో కొల్లేరు సరస్సులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.. ఇప్పటికే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, పత్తికోళ్లంక, మొండికోడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా.. మండవల్లి గ్రామంలో పెనుమాకలంక, మణుగూరు వంటి 9 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి..
Ramalingeswara Nagar: విజయవాడ నగరంలోని రామలింగేశ్వర నగర్ లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఏడోవ లైన్లో ఉన్న రిటైనింగ్ వాల్ లీక్ అవ్వడంతో కాలనీలోకి నీరు చేరింది. పోలీస్ కాలనీ వద్ద రిటైనింగ్ వాల్ లాక్స్ బ్రేక్ అయినట్లు స్థానికులు చెబుతున్నారు. ముంప్పు ప్రాంతాల వారిని పునానవాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు.
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 2.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది.. శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.. దీంతో.. ఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. శ్రీశైలం జలాశయంలోని రెండు రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు.
కర్నూలు జిల్లాలో ఉన్న హంద్రీ నదిలో 25 మంది కూలీలు చిక్కుకున్నారు. గోనెగండ్ల మండలం గంజహల్లి, దేవనకొండ మండలం తెర్నెకల్ మధ్య ఉన్న హంద్రీ నదిలో 25 మంది చిక్కుకున్నారు. చిక్కుకున్న వారు గంజిహల్లికి చెందిన వారిగా తెలిసింది.
కృష్ణా నదికి వరద ప్రవాహం భారీగా వస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండంతో నదిలోనికి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. దీనికి తోడు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఈ వరద నీరంత ప్రస్తుతం కృష్ణా నదిలోకి వచ్చి చేరడంతో నీటి ప్రవాహం గంట, గంటకు పెరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్ట్ లు ఒక్కొక్కటిగా పూర్తిస్థాయిలో నిండుతున్నాయి. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తుండగా.. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతుంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే పై కారపోకలు బంద్ అయ్యాయి. నాగార్జున హైవే పై నీరు ప్రమాదకరంగా పారుతుండటంతో.. అప్రమత్తమైన అధికారులు బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ మళ్లించారు. హైద్రాబాద్ -నాగార్జున సాగర్ ప్రధాన రహదారి రోడ్ శ్రీఇందు కాలేజీ వద్ద ఉదృతంగా ప్రవహిస్తుంది. సాయంత్రంలోగ మరింత వర్షం పడితే రోడ్డు పూర్తిగా తెగిపోయే ప్రమాదం