తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్ట్ లు ఒక్కొక్కటిగా పూర్తిస్థాయిలో నిండుతున్నాయి. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తుండగా.. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరుగుతుంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.