దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. బయటకు రావాలంటనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. తాజాగా పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Fake Seeds: భారీ స్థాయిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఈస్ట్ రాజస్థాన్, యూపీ, తెలంగాణలో హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. వచ్చే ఐదు రోజుల పాటు వేడి గాలులు ఉంటాయని తెలిసింది. ఇక పంజాబ్, హర్యానా, ఈస్ట్ మధ్య ప్రదేశ్, యూపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో రాత్రి పూట కూడా వేడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది.
ఇది కూడా చదవండి: Telangana Formation Day 2024: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు