Priyadarshi : టాలీవుడ్ లో నెగెటివ్ రివ్యూలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. సినిమా విడుదలైన రోజే రివ్యూలు ఇవ్వకుండా బ్యాన్ చేయాలంటూ సినీ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దీనిపై హీరో ప్రియదర్శి స్పందించారు. రివ్యూలు రాయకుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదు అన్నారు. ‘సినిమా అనేది చాలా పెద్దది. దాన్ని రివ్యూలు రాయకుండా చూడటం అంటే కష్టం. అసలు అది సాధ్యం కూడా కాదు. సినిమాకు వెళ్లిన వారు అది ఎలా ఉందో చెప్పకుండా చూసే అధికారం మనకు లేదు. సినిమా తీసే అధికారం ఎంత ఉందో.. దానికి రివ్యూ చెప్పే అధికారం కూడా అంతే ఉంది. కాకపోతే రివ్యూలు రాయడంలో కొంత పరిధిలు పాటిస్తే బాగుంటుంది అన్నారు ప్రియదర్శి.
Read Also : Shine Tom Chacko : షైన్ టామ్ చాకోపై కఠిన చర్యలు తీసుకుంటాం : కేరళ మంత్రి
కొన్ని సార్లు మరీ దారుణమైన భాషతో రివ్యూలు చెబుతున్నారు. అది మార్చుకుంటే మంచిది. ఎందుకంటే కష్టపడి సినిమా తీసినప్పుడు కావాలని నెగెటివ్ రివ్యూలు రాయడం కరెక్ట్ కాదు. బాగుంటే బాగుందని రాయాలి. లేకపోతే లేదని రాయాలి. కానీ మరీ దారుణమైన భాష వాడి సినిమాను తిట్టడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అందరికంటే ప్రేక్షకులు గొప్పవాళ్లు. వారు ట్రైలర్ చూసి ఏ సినిమా చూడొచ్చు అనేది డిసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి రివ్యూలు ఏ స్థాయిలో ఎఫెక్ట్ చూపిస్తాయనేది మనం చెప్పలేం. నా సినిమాలకు చాలా సార్లు కరెక్ట్ గానే రివ్యూలు ఇచ్చారు. ప్లాప్ అయినప్పుడు ప్లాప్ రివ్యూలు ఇస్తే తీసుకోవాలి’ అంటూ తెలిపారు.