Delhi liquor Scam Case: మనీష్ సిసోడియాకు విముక్తి లభించేనా? బెయిల్ పిటిషన్‌పై విచారణ నేడు..
- మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు
- జులై 29న విచారణ సందర్భంగా దర్యాప్తు వివరాలను తెలిపి సీబీఐ
- మద్యం పాలసీ కేసులో 2023 ఫిబ్రవరి 26 సిసోడియా అరెస్ట్
- కోర్టులో చాలా సార్లు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. జులై 29న విచారణ సందర్భంగా సీబీఐ, ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు, సిసోడియా పిటిషన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన సమాధానాన్ని దాఖలు చేసిందని కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసుకు సంబంధించిన అవినీతి కేసులో సిసోడియాను 2023 ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 28న ఢిల్లీ కేబినెట్‌కు రాజీనామా చేశారు. అదే సమయంలో.. మార్చి 9న మనీలాండరింగ్ కేసులో ఈడీ అతన్ని అరెస్టు చేసింది. అప్పటి నుంచి మనీష్ తీహార్ జైలులో ఉన్నారు.
READ MORE: Pakistan : పాకిస్థాన్‌లో ఆకస్మిక వరదలు.. 24 గంటల్లో 11 మంది మృతి
Also Read
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
- Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
- Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
మనీష్ సిసోడియా 17 నెలలుగా కస్టడీలో ఉన్నారని.. గత ఏడాది అక్టోబర్ నుంచి తనపై వచ్చిన కేసులో ఎలాంటి పురోగతి లేదని.. అందుకే బెయిల్ కోరుతూ గతంలో వేసిన పిటిషన్‌ను పునఃపరిశీలించాలని సిసోడియా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకుముందు జులై 11న, సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ రివ్యూ పిటిషన్‌పై విచారణకు ముందు, జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత విచారణ వాయిదా పడింది. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లు ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో అనేకసార్లు తిరస్కరించబడ్డాయి.
READ MORE:Rangareddy Crime: విచారణ జరిపించండి.. షాద్ నగర్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్..
జున్ 4న బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు..
ఈ ఏడాది ఏప్రిల్ 30న సిసోడియా బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిసోడియా హైకోర్టును ఆశ్రయించారు. మే 21న రెండు కేసుల్లో (అవినీతి, మనీలాండరింగ్) సిసోడియాకు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జున్ 4న సిసోడియా బెయిల్ పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై పునరాలోచించాలంటూ సిసోడియా పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం జులై 11న విచారణ చేపట్టింది.
తాజావార్తలు
-
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
-
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!