MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో ప్రారంభమైన విచారణ ప్రారంభమైంది. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ జగ్గూ స్వామి వేసిన క్వాష్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. బీఎల్ సంతోష్ కి ఇచ్చిన 41 CRPC నోటీసులపై విచారణ కొనసాగుతోంది. నేటితో బీఎల్ సంతోష్ కు ఇచ్చిన నోటీసులపై స్టే ముగియనుంది. దీంతో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి హైకోర్టుకి చేరుకున్నారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు ఇచ్చిన స్టేను హైకోర్టు ఈ నెల 13వరకు పొడిగించింది.
Read Also: Pattabhi Ram: ఈడీ నోటీసులతో మాకేం భయం లేదు
బీఎల్ సంతోష్ నోటీసులఫై గతంలోనే హైకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే గడువు నేటితో ముగిసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగ్గుస్వామి సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు నోటీసులపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ‌్యంలో రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతోంది.