Best Cooking Oil: ‘నూనె’ లేకుండా కూర వండడం అసాధ్యం. అందుకే వంటగదిలో నూనె తప్పనిసరి పదార్థంగా మారింది. ప్రస్తుతం రకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. ఆవాల నూనె, వేరుశెనగల నూనె, నువ్వుల నూనె, నెయ్యి, కొబ్బరి నూనె లేదా డాల్డాను చాలామంది ఉపయోగిస్తారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయి.. అదే సమయంలో అనారోగ్యం బారిన పడేసేవి కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిలో వంట చేయడానికి ఏ నూనె ఉత్తమమో అని చాలా మంది అయోమయంలో ఉంటారు?. అన్నింటికంటే ఆరోగ్యానికి ఏ నూనె ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో? తెలుసుకుందాం.
ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ జయేష్ శర్మ ఇటీవల సోషల్ మీడియాలో ఒక రీల్‌ను పంచుకున్నారు. వంట చేయడానికి ఏ నూనె ఉత్తమమో? చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆహారం, జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవాలని జయేష్ శర్మ వివరించారు. ఆహారంలో పామాయిల్, నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని ప్రజలలో ఒక నమ్మకం ఉంది. ఏ నూనె గుండెకు మంచిది, ఏ నూనె కాదో డాక్టర్ జయేష్ శర్మ చెప్పారు.
నెయ్యి: 90లలో ఆవ నూనెలో డాల్డా వాడటం వల్ల నెయ్యి చెడుగా పరిగణించబడింది. నిజం ఏమిటంటే పరిమిత పరిమాణంలో నెయ్యిని తీసుకోవడం వల్ల ఎటువంటి హాని లేదు. నెయ్యిని ఎక్కువ స్వీట్లు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. రుచి కోసం వినియోగిస్తారు.
ఆవాల నూనె: ఆవాల నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని, ఇవి ఆరోగ్యానికి మంచివని డాక్టర్ జయేష్ శర్మ వివరించారు. ఇందులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు కూడా ఉన్నాయి. వేడి ఆవాల నూనె నుంచి వచ్చే పొగకు ప్రజలు భయపడతారు కానీ.. ఆందోళన చెందడానికి ఏమీ లేదని డాక్టర్ చెప్పారు.
Also Read: Viral Video: అక్కడ కప్ప పకోడీలు చాలా ఫేమస్.. లొట్టలేసుకుంటూ తింటున్న జనాలు!
వేరుశెనగ నూనె: పశ్చిమ భారతదేశంలో వేరుశెనగ నూనెను సాధారణ వంటలలో ఉపయోగిస్తారు. ఇది అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. గుండెకు మంచి చేసే కొన్ని ఏజెంట్లను కలిగి ఉంటుంది. ఇది క్యాన్సర్‌ను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
డాల్డా: డాల్డాను క్రమం తప్పకుండా వాడకూడదని డాక్టర్ జయేష్ శర్మ చెప్పారు. ఇందులో సంతృప్త కొవ్వులు ఉంటాయి. వేడి చేసినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి. డాల్డాలోని పలు చెడు ఏజెంట్లు శరీరానికి హాని కలిగిస్తాయి. కాబట్టి ఈ నూనెకు దూరంగా ఉండడం మంచిది.
పామాయిల్: పామాయిల్‌లో కొవ్వు, హానికరమైన పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజూ వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంగా ఉండటానికి ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినాలని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే డాల్డా, పామాయిల్‌ను బయటి ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.