మన వంట గదిలో లభించేవాటితో ఎంతో ఆరోగ్యం ఉందన్న విషయం తెలిసిందే..కొన్నిటిని తీసుకోవడం వల్ల అరికాళ్ల నుండి మొత్తం బాడీలో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. ఈ పొడి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో .. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ పొడి కోసం ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నల్ల జీలకర్ర అనేది చాలా చేదుగా ఉంటుంది. దీనిని ఔషధంగా మాత్రమే ఉపయోగించాలి. అధిక బరువు, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఈ జీలకర్ర ఎంతగానో సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు, వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. వాత దోషాలను తగ్గించడంలో కూడా ఈ జీలకర్ర మనకు ఎంతో సహాయపడుతుంది. అలాగే మనం ఉపయోగించాల్సిన రెండోది మెంతులు. వీటిని 5 టీ స్పూన్ల మోతాదులో ఉపయోగించాల్సి ఉంటుంది. వాత దోషాలను తగ్గించడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, కీళ్ల నొప్పులను, మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో మెంతులు సహాయపడతాయి..
ఇక మూడో పదార్థం వాము.. రెండు టీ స్పూన్ల మోతాదులో ఉపయోగించాల్సి ఉంటుంది. షుగర్ ను అదుపులో ఉంచడంలో, జీర్ణసమస్యలను తగ్గించడంలో వాము బేషుగ్గా పని చేస్తుంది. అంతేకాకుండా దీనిని ఉపయోగించడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తొలగిపోతుంది..ఈ పొడిని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా కళాయిలో మెంతులను వేసి వేయించాలి. చిన్న మంటపై మూడిటిని ఒక్కోసారి వేయించి పక్కన పెట్టుకోవాలి.. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రాత్రి భోజనం చేసిన గంట తరువాత టీ తాగినట్టు తాగాలి. ఈ నీటిని తాగిన తరువాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. శరీరంలో కొత్త రక్తం తయారవుతుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది..జుట్టు రాలడం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. ఈ పొడిని రోజు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.