ఉత్తరప్రదేశ్‌ బదౌన్ జిల్లాలోని బిల్సీలో అట్టహాసంగా పెళ్లి వేడుక జరుగుతోంది..

కుటుంబ సభ్యులతో మేళతాళాలతో వరుడు గ్రామానికి ఊరేగింపుగా చేరుకున్నాడు

అర్ధరాత్రి వివాహవేడుక మొదలైంది. జయమాల కార్యక్రమంలో వరుడు.. వధువు మెడలో మాల వేస్తున్న సమయంలో ఆమెను ముద్దుపెట్టుకున్నాడు.

అంతటితో ఆగకుండా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

వరుడు పదే పదే అసభ్యకర పనులు చేయడంతో వధువు మనస్తాపానికి గురైంది.

వరుడి ప్రవర్తనతో షాకైన వధువు. అతనిని పెళ్లి చేసుకోనంటూ వధువు మండపంలోనే తేల్చిచెప్పింది.

దీంతో వధువు, వరుడు కుటుంబసభ్యులు ఒకరినొకరు గొడవకు దిగారు.

పంచాయతీ నిర్వహించినా వధువు ఏమాత్రం తగ్గలేదు, పెళ్లి చేసుకునేది లేదంటూ  తేల్చి చెప్పింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పెళ్లికొడుకుతో పాటు అతని తండ్రి, బంధువులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.