Milk: ఆరోగ్యానికి మంచిదని పాలు ఎక్కవగా తాగుతున్నారా? వెంటనే ఆపేయండి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milk Over Consumption: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. చిన్న పిల్లలు త్వరగా పెరగడానికి పాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. రోజుకు ఒక కప్పు పాలు తాగితే ఆరోగ్యానిక చాలా మంచిది. పాలలో పాలలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషయం, విటమిన్ డి, బి 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకల బలంగా ఉండటానికి కాల్షియం ఉపయోగపడుతుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా ఎముకలు బలంగా ఉండటానికి పాలు తాగాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అంతేకాకుండా రాత్రిపూట పాలు తాగితే ప్రశాంతంగా నిద్రకూడా పడుతుంది. అయితే రోజుకు మూడు కప్పుల వరకు పాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అంతకు మించి తీసుకుంటే శరీరానికి కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అంటే ఏ విషయంలో అయినా అతి పనికి రాదు. అతిగా తీసుకుంటే ఎంత మంచి చేసేదైనా అనర్థంగానే మారుతుంది. పాలు తాగే విషయంలో కూడా అదే వర్తిస్తుంది. పాలు ఎక్కువగా తీసుకుంటే వాతం చేస్తుంది. పేగుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. పాలలో ఉండే ఎ1 కేసైన్ కారణంగా ఇలా జరుగుతుంది. పాలు ఎక్కువగా తీసుకుంటే పేగులపై పొరలా ఏర్పడి జీవప్రక్రియ ఆలస్యమవుతుంది. అంతేకాకుండా కడుపులో మంటగా కూడా అనిపిస్తుంది. ఇది ప్రేగుల అల్సర్ కు దారి తీయవచ్చు.
Also Read: Jabardasth Shanthi: సర్జరీ కోసం ఇల్లు అమ్మేస్తున్న జబర్దస్త్ నటుడు..
Also Read
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
పాలు అధికమొత్తంలో తాగేవారిలో కడుపు ఊబ్బరం, తిమ్మిరి, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. పాల వల్ల ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా సమస్యలు వస్తాయి. వాటిలో ప్రధానంగా చర్మ సమస్యలు కూడా కలగవచ్చు. చర్మానికి ఎంతో వన్నె తెచ్చే పాలు చర్మ సమస్యలకు ఎలా కారణమవుతాయి అనుకుంటున్నారా? అవును నిజంగానే పాలు ఎక్కువగా తీసుకుంటే చర్మంపై ఎర్రటి దద్దురులు, పగుళ్లు ఏర్పడతాయి. అంతేకాకుండా ఎలర్జీ, మెటిమలు కూడా పాలు అధికంగా తాగితే రావచ్చు. అయితే మనం పాలు తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం స్వచ్ఛమైన పాలనే తాగాలి. ప్రస్తుతం అన్నీ కల్తీ అవుతున్నాయి. పాలలో కూడా యూరియా కలిపి కల్తీ చేస్తున్నట్లు అనేక కథనాలు వస్తున్నాయి. అందుకే పాలు తాగేటప్పుడు ఎటువంటి రసాయనాలు లేని ఆరోగ్యకరమైన పాలనే తాగాలి.
తాజావార్తలు
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!