HCA Funds Misuse: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిధుల దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఆడిట్ నిర్వహిస్తేనే నిధుల దుర్వినియోగంపై సీఐడీకి క్లారిటీ రానుంది. జగన్ మోహన్ రావు అధ్యక్షుడు అయిననాటి నుంచి బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రూ. 240 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు అక్రమాల చిట్టా కలకలం రేపుతోంది. హెచ్‌సీఏలో జగన్మోహన్ రావు అక్రమాలకు అంతే లేదు. హెచ్‌సీఏలోకి అడ్డదారిలో వచ్చిన ఆయన.. వందల కోట్లు దోపిడీ చేశారు. క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ ఇస్తున్న నిధులను జగన్మోహన్ రావు దుర్వినియోగం చేశారు. ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ వివాదంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా బుధవారం జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నేడు మల్కాజిగిరి కోర్టులో ఆయన్ను సీఐడీ హాజరుపరచనుంది. జగన్మోహన్‌తో…