Group-1 Prelims: ఎన్నిసార్లు విఫలమవుతారంటూ టీఎస్పీఎస్సీపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై తెలంగాణ హైకోర్టు ఇవాళ(మంగళవారం) విచారణ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటూ తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ టీఎస్పీఎస్సీపై మండిపడింది. ఒకసారి పేపర్ లీక్, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్య పేరుతో విద్యార్థుల జీవితాలో ఆడుకుంటున్నారంటూ హైకోర్టు విమర్శించింది.
Read Also: Nithya Menen: స్టార్ హీరో నన్ను వేధించాడు.. ఆ ఇండస్ట్రీ వలన ఎన్నో ఇబ్బందులు పడ్డా
Also Read
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలంగాణ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదని టీఎస్పీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలం అయ్యిందని, రెండోసారి కూడా నిబంధనలు పాటించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహించిందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా, జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను క్యాన్సిల్ చేస్తూ.. ఈనెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ వెళ్లింది.
Read Also: AP Fibernet Scam: ఏపీ ఫైబర్ నెట్ స్కాం.. రూ.114 కోట్లు కొట్టేశారు
అయితే, వాస్తవానికి 11 సంవత్సరాల తర్వాత గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్ ఎక్సామ్ నిర్వహించారు. ఆ తరువాత ప్రిలిమ్స్ ప్రశ్న పత్రాల లీకేజీ కుంభకోణం వెలుగులోకి రావడంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దవడంతో ఇటు అభ్యర్థులతో పాటు టీఎస్పీఎస్సీ కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది.
తాజావార్తలు
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!