హర్యానాలో హత్యకు గురైన మోడల్ శీతల్ చౌదరి కేసు మిస్టరీ వీడింది. పోలీసులు మర్డర్ కేసును కొలిక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రియుడు సునీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. శీతల్‌ను చంపి.. మృతదేహంతో ఉన్న కారును కాలువలో పడేసి రోడ్డు ప్రమాదానికి చిత్రీకరించాలని నిందితుడు భావించాడని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Puri Jagannadh : తమిళ ‘బెగ్గర్’తో మలయాళ కుట్టి రొమాన్స్
శీతల్ చౌదరి.. హర్యానాలో మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆల్బమ్స్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. ఆమెకు వివాహమై ఐదు నెలల బిడ్డ ఉంది. అయితే గతంలో సునీల్‌కు చెందిన హోటల్లో శీతల్ పని చేసేది. వారిద్దరి మధ్య ఆరు సంవత్సరాలుగా స్నేహం ఉంది. సునీల్‌కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని శీతల్‌ను ఒత్తిడి తెస్తున్నాడు. అయితే సునీల్ వివాహితుడని పెళ్లి ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది. దీన్ని సునీల్ మనసులో పెట్టుకున్నాడు.
ఇది కూడా చదవండి: Noida: నువ్వు ఎల్తావా మావ?.. రన్నింగ్ బైక్ పై లవర్స్ రొమాన్స్.. ఏకంగా రూ. 53,500 ఫైన్
ఇక శీతల్ జూన్ 14న(శనివారం) ఆల్బమ్ షూట్ కోసం పానిపటగ్లోని అహార్ గ్రామానికి వెళ్లింది. రాత్రి 10:30 గంటలకు శీతల్‌ను కలిసేందుకు సునీల్ వచ్చాడు. కారు దగ్గరకు ఆమెను తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించారు. మరోసారి పెళ్లి విషయమై వాగ్వాదం నడిచింది. దీంతో శీతల్‌పై సునీల్ భౌతికదాడి చేశాడు. వెంటనే శీతల్ తెల్లవారుజామున 1:30 గంటలకు తన సోదరి నేహాకు వీడియో కాల్ చేసి విషయం చెప్పింది. అనంతరం తిరిగి సోదరి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. శీతల్’ను సంప్రదించలేకపోయింది.
అయితే నిందితుడు శీతల్‌ను అనేకమార్లు కొట్టి.. పొడవడంతో చనిపోయినట్లుగా పోలీసులు తేల్చారు. మృతదేహాన్ని కారులో పెట్టి కాలువలోకి నెట్టేశాడని.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఇలా చేశాడని పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రిలో చేరి.. తాను తప్పించుకున్నానని.. శీతల్ మాత్రం తప్పించుకోలేక ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసులకు స్టోరీ చెప్పాడు. లోతుగా దర్యాప్తు చేపట్టగా.. సునీల్ నేరాన్ని అంగీకరించాడు. తానే శీతల్‌ను చంపేసి.. కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. అసలెందుకు చంపాల్సి వచ్చిందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.