మ్యూజిక్ బ్రహ్మ మణిశర్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు. ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమాలకు మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం ఇప్పటికే సెన్సేషన్. కానీ ఆయన వరుసుడు మహాతి స్వర సాగర్ ఎందుకనో అంతగా సక్సెస్ కాలేకపోయాడు. నాగసౌర్య నటించిన జాదూగాడు సినిమాతో టాలీవుడ్ కు సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు మహతి. కానీ ఆ సినిమాతో సరైన గుర్తింపు రాలేదు కానీ అదే హీరో నటించిన ఛలో సినిమాతో ఒక్కసారిగా మహతి పేరు మారుమోగింది.
Also Read : KINGDOM : నేడు కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు వివరాలు వెల్లడించిన పోలీస్ శాఖ..
కానీ ఆ తర్వాత వచ్చిన @నర్తనశాల, కృష్ణ వింద విహారి, మాస్ట్రో, మాచర్ల నియోజక వర్గం సినిమాలు మహతి క్రెజ్ ను తగ్గించేసాయి. కానీ మెగాస్టార్ చిరు హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన భోళా శంకర్ సినిమాకు మహతి స్వర సాగర్ కు సంగీత బాధ్యతలు అప్పగించారు. మెగాస్టర్ సినిమా అవకాశం రావడంతో మ్యూజిక్ లో ఎదో మ్యాజిక్ చేస్తడనుకున్న ఆడియెన్స్ ను మహతి నిరాశపరిచాడు. దాంతో మనోడికి ఇక సినిమాలు లేకుండా పోయాయి. ఇక ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మహాతికి మరో మంచి ఛాన్స్ వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబోలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు ఇప్పుడు మహాతికి అవకాశం ఇచ్చింది పూరి కనెక్ట్స్. ఈ సినిమాకు మహతి కంపోజింగ్ కూడా స్టార్ట్ చేసాడని మంచి సాంగ్ ను రిలీజ్ చేసి అఫీషియల్ మహతి పేరును అనౌన్స్ చేయనున్నారట.