Harry Potter Reboot: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ మూవీ సిరీస్ లలో ఒకటైన హ్యారీ పోట్టర్ (Harry Potter) ఇప్పుడు మరోసారి తెరపైకి రాబోతుంది. ఈ సిరీస్‌కు గల ఫ్యాన్‌బేస్ ను దృష్టిలో ఉంచుకుని HBO Max తాజాగా దీనికి రీబూట్ వెర్షన్ ప్రారంభించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సారి హ్యారీ పోట్టర్ పాత్రలో స్కాట్లాండ్‌కు చెందిన నటుడు డొమినిక్ మెక్‌లాఫ్లిన్ (Dominic McLaughlin) నటిస్తున్నారు. HBO Max అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫోటోలో, డొమినిక్ హ్యారీ పోట్టర్ కోస్ట్యూమ్‌లో క్లాప్‌బోర్డ్ పట్టుకొని కనిపించారు. ఆ ఫొటోలో గుండ్రటి కళ్లద్దాలతో హాగ్వాట్స్ యూనిఫారమ్ ధరించి కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Read Also:Shubanshu Shukla: Axiom-4 మిషన్ విజయవంతం.. సేఫ్ ల్యాండింగైన శుభాంశు శుక్లా అండ్ టీం..!
ఈ లుక్ విడుదల చేస్తూ HBO Max… “First Year, Step Forward” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీని ద్వారా ఈ హ్యారీ పోట్టర్ సిరీస్ ఇప్పుడు అధికారికంగా ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించినట్టు స్పష్టం చేసింది. అభిమానులు ఈ పోస్టుకు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇందులో చాలామంది ఆ అబ్బాయి ఈ పాత్రకు పర్ఫెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తుండగా, మరికొంతమంది ‘అల్ ది బెస్ట్ లిటిల్ హ్యారీ..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రీబూట్ సిరీస్‌లో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారు కూడా ప్రకటించబడ్డారు. ఇందులో
* రోరి విల్మట్ (Rory Wilmot) – నెవిల్ లాంగ్‌బాటమ్ పాత్రలో
* ఏమోస్ కిట్సన్ (Amos Kitson) – డడ్లీ డర్స్లీ పాత్రలో
* లూయిస్ బ్రిలీ (Louise Brealey) – మేడమ్ రోలాండా హూచ్‌గా
* ఎంటోన్ లెసెర్ (Anton Lesser) – గారిక్ ఒలివెండర్ పాత్రలో కనిపించనున్నారు.
Read Also:Realme C71: 6300mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ ఫోన్ ఇంత తక్కవ ధరలో ఏంటి భయ్యా.. రియల్‌మీ C71 లాంచ్..!
ఈ హ్యారీ పోట్టర్ రీబూట్ కూడా ఇదివరకు మాదిరిగానే J.K. రౌలింగ్ రచించిన నవలల ఆధారంగా రూపొందించబడుతోంది. ఈ సిరీస్‌కు ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రౌలింగ్ ప్రకారం, రైటర్లతో ఆమె దగ్గరగా పనిచేసారని.. ఇప్పటికే మొదటి రెండు ఎపిసోడ్లు ఆమె చూసి చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. హ్యారీ పోట్టర్ సిరీస్‌లో తొలి బుక్ ‘Harry Potter and the Philosopher’s Stone’ 1997 జూన్ 26న విడుదలై అందరికీ పరిచయమైంది. దీనిపై ఆధారంగా రూపొందిన తొలి సినిమా ‘Harry Potter and the Sorcerer’s Stone’ 2001లో వరల్డ్ ప్రీమియర్ పొందింది. ఈ సిరీస్ లో మొత్తం 8 సినిమాలు విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టాయి.