Minister Of Health Department Harish Rao Was Conducted Video Conference With Collectors over Seasonal Diseases.
సీజనల్ వ్యాధులపై ముందు జాగ్రత చర్యగా జిల్లా కలెక్టర్లు, అధికారు లతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందదర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపరీతంగా వర్షాలు పడ్డాయి .. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయని, మలేరియా ములుగు, కొత్తగూడెం జిల్లాలో నమోదు అయ్యాయన్నారు. అన్ని జిల్లాల్లో టెస్టింగ్ కిట్ లు పెద్ద ఎత్తున పంపించామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. మంత్రులను జిల్లాలకు వెళ్ళాలని సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం.. పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు శాఖకు 10 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్న ఒక వ్యక్తిని గుర్తించామని, ఇంకా వ్యాధి నిర్దారణ కాలేదని ఆయన వివరించారు. ముందుగానే జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచామని, ఫీవర్ హాస్పిటల్ ను నోడల్ హాస్పిటల్ గా ఏర్పాటు చేశామన్నారు.
గాంధీ హాస్పిటల్ లో టెస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం శాంపిల్ పూణేకు పంపించాలని చెప్పిడంతో పంపించామన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళండని ఆయన సూచించారు. ప్రతి ఆదివారం ఇంటింటికి వెళ్లి ఇళ్లను క్లీన్ చేసే కార్యక్రమం, ఇంటి అవరణను శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి శుక్రవారం అన్ని సంస్థల్లో, కార్యాలయాల్లో డ్రై డే పాటించాలన్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా కేసులు నమోదు అయితే మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.