Bandi Sanjay Kumar: టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలెలా ఇస్తారు..?
- టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలెలా ఇస్తారు..?
- ప్రభుత్వాలు, పాలకులు మారినా వాళ్లను ఇంకా కొనసాగించడమేంటి?
- టీటీడీలో వెయ్యి మంది అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు?
- మసీదు, చర్చిలల్లో హిందువులకు ఉద్యోగాలిస్తారా?
- ధూపదీప నైవేద్యాలకు నోచుకుని ఆలయాలను, పురాతన దేవాలయాలను టీటీడీ ఆదుకోవాలి
- కరీంనగర్ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని వెంటనే నిర్మించాలి
- ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్
- కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్
- బండికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి, అమిత్ షా, సీఎంసహా పలువురు ప్రముఖులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Kumar: తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికిపైగా అన్యమతస్తులకు ఏ విధంగా ఉద్యోగాలిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్లను ఉద్యోగాలనుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో భూమిపూజ చేసిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు.
ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివ్రుద్ధి చేయాలన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన బండి సంజయ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్నారు. బండి సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్కడ్, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిసహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపారు. అమిత్ షా కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ కు ఫోన్ చేసి బర్త్ డే విషేశ్ తెలిపారు. మరోవైపు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
Read Also:RAPO 22 : హైదరాబాద్ లో ఆంధ్ర కింగ్..
ఈరోజు జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నాను. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రశాంత వాతావరణంలో జీవించాలి. ఈ దేశం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం కలిసికట్టుగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉండాలి. శక్తివంతమైన భారత్ నిర్మాణం కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం అహర్నిశలు పనిచేస్తున్న ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించేలా శక్తి సామర్థ్యాలు కల్పించాలని స్వామి వారిని వేడుకునన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలను, అభివృద్ధికి నోచుకోని పురాతన దేవాలయాలను గుర్తించి టీటీడీ నిధులను కేటాయించి యుద్ద ప్రాతిపదికన ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేయాలని కోరుతున అన్నారు. కరీంనగర్ లో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. గుడిని వెంటనే నిర్మించాలి. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు.
హిందువుల ఆస్తి తిరుమల. విదేశీయులు, అన్యమతస్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పనిసరి. దురద్రుష్టమేమిటంటే.. టీటీడీలో వెయ్యి మందికిపైగా ఇతర మతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి హిందు మతంపై, దేవుడిపై నమ్మకం లేదు. అలంటి వారికి ఉద్యోగాలివ్వమేంటి..? వాళ్లను కొనసాగించడమేంటి..? ఇట్లాంటి పద్దతి మంచిది కాదు. ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందున ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోంది.
స్వామివారిపై నమ్మకంలేని వ్యక్తులకు జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారు. హిందువులంతా దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడో వాళ్లను నియమించారని చెప్పి తప్పించుకోవడం సరికాదు. తక్షణమే వాళ్లను తొలగించాలి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లను కొనసాగించడం కరెక్ట్ కాదు. ఓటు బ్యాంకు రాజకీయాలు సరికాదు. ఇది హిందువుల ఆస్తి. నేనడుగుతున్నా.. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకుని హిందువులు వెళితే ఉద్యోగాలిస్తారా..? ఇవ్వరు కదా..? అట్లాంటప్పుడు టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలెలా ఇస్తారు..? ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇంకా ఈ ఆనవాయితీని కొనసాగించడం మంచి పద్దతి కాదు. తక్షణమే వాళ్లను తొలగించాలని కోరుతున్నా అని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..