Curtis Campher: ప్రపంచ క్రికెట్ లో ఎప్పుడూ ఏదో ఒక రికార్డు క్రియేట్ అవుతూనే ఉంటుంది. పెద్ద జట్ల ప్లేయర్స్ కంటే ఒక్కోసారి చిన్న జట్ల ఆటగాళ్లలో ఎవరో ఒకరు.. బౌలర్ కానీ, బ్యాటర్ కానీ.. కొత్త రికార్డులు సృష్టిస్తూనే వుంటారు. ఇప్పుడు అలాంటి మరో రికార్డు ఒకటి నమోదయ్యింది. ఎవరి ఊహకు అందని ఆ రికార్డుని ఆ బౌలర్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఐర్లాండ్ లో జరుగుతున్న నేషనల్ టీ20 లీగ్ లో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ కాంఫర్ సాధించాడు. మరి ఆ రికార్డ్ ఏంటి..? ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దామా..
Read Also:HYDRA: కూకట్‌పల్లి బాలాజీ నగర్ డివిజన్ హబీబ్ నగర్‌లో హైడ్రా కూల్చివేతలు.
ఐర్లాండ్ లో జరుగుతున్న ఇంటర్ ప్రొవిన్సియల్ టీ20 టోర్నీలో ఒక బౌలర్ 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాదు.. ప్రొఫెషనల్ క్రికెట్లో ఈ ఫీట్ సాదించిన మొదటి బౌలర్ గానూ నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మాన్స్టర్ రెడ్స్ (Manster Reds), నార్త్ వెస్ట్ వారియర్స్ (North West Warriors) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మాన్స్టర్ రెడ్స్ బౌలర్ కర్టిస్ కాంఫర్ 5 వరుస బంతుల్లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.
Read Also:Maharashtra: కారుతో స్టంట్లు.. అదుపుతప్పి 300 అడుగుల లోయలో పడిన యువకుడు
ఇక ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన రెడ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. అనంతరం 189 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన వారియర్స్ జట్టు 11 ఓవర్లకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. అప్పుడు కర్టిస్ కాంఫర్ 2వ ఓవర్ వేసేందుకు బాల్ అందుకున్నాడు. కాంఫర్ 12 ఓవర్ చివరి 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. మళ్ళీ తన 3వ ఓవర్లో అంటే 14 ఓవర్ లో మొదటి 3 బంతులకు 3 వికెట్లు తీసి క్రికెట్ లో ఇంతకముందు ఎప్పుడు చూడని సరికొత్త రికార్డుని తన పేరు మీద లిఖించాడు. దీంతో రెడ్స్ జట్టు 100 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది.